‘అర్జున్‌రెడ్డి’తో మహేష్ హీరోయిన్!

‘అర్జున్‌రెడ్డి’ బాలీవుడ్ రీమేక్‌లో కైరా అద్వాణీ కన్ఫార్మ్... అధికారికంగా ప్రకటించిన హీరో షాహిద్ కపూర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 25, 2018, 3:41 PM IST
‘అర్జున్‌రెడ్డి’తో మహేష్ హీరోయిన్!
షాహిది కపూర్, కైరా అద్వాణీ
  • Share this:
2017లో వచ్చిన సినిమాల్లో ‘అర్జున్‌రెడ్డి’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గేమ్ ఛేంజర్‌గా... బోల్డ్ అటెప్ట్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ ఒక్క సినిమాతో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. సంకల్ప్ వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను తమిళ్‌లో బాల దర్శకత్వంలో ‘వర్మ’ పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీలో కూడా ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రీమేక్ అనుకున్నప్పుడే హీరోగా షాహిద్ కపూర్ ఎంపికవ్వగా... హీరోయిన్ విషయంలో మాత్రం అనేక మార్పులు జరుగుతున్నాయి. మొదట ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రీమేక్‌లో శ్రీదేవి అందాల తనయ జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందని అన్నారు. ఆ తర్వాత హీరో సైఫ్ అలీ ఖాన్ గారాల కూతురు సారా అలీ ఖాన్ నటిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ కాకుండా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో హీరోయిన్‌గా నటిస్తున్న తారా సుతానియాను హీరోయిన్‌గా ప్రకటించింది చిత్ర బృందం. అయితే సినిమా ప్రారంభం కాకముందే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది తారా సుతానియా.

‘అర్జున్‌రెడ్డి’ నా ఫెవరెట్ హీరోయిన్. హీరోయిన్ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఈ పాత్ర చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా...

కైరా అద్వాణీతెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలోనే ఘాటైన ముద్దు సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. బాలీవుడ్ రీమేక్‌లో ఈ డోస్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. షాహిద్, కైరా అద్వాణీ మధ్య ఘాటైన కెమెస్ట్రీ చూసేందుకు యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన నటించిన కైరా... బోయపాటి శ్రీను, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ నటిస్తోంది. కొన్నాళ్ల కిందటే వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మతులు పోగొట్టిన కైరా... ప్రీతిగా ఏ రేంజ్‌లో ఇరగదీస్తుందో వేచి చూడాలి.
First published: September 25, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>