మ్యాగీ చేయడం వచ్చు.. పూరితో సినిమాకు రెడీ : మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాట్లాడాడు.

news18-telugu
Updated: June 1, 2020, 7:28 AM IST
మ్యాగీ చేయడం వచ్చు.. పూరితో సినిమాకు రెడీ : మహేష్ బాబు
మహేష్ Photo : Twitter
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాట్లాడాడు. సూపర్ స్టార్ కృష్ణ మే 31న తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మహేష్ తన అభిమానులను సోషల్ మీడియా వేదికగా కలిసాడు. అందులో భాగంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం నిన్న సాయంత్రం ఐదు గంటల నుండి మొదలైంది. ఈ సందర్భంగా నెటిజన్స్ చాలా ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని ‘ మీ ఫేవరేట్ కలర్ అండ్ ఫుడ్ ఏమిటి ? అని అడగగా.. ‘నా ఫేవరేట్ కలర్ బ్లూ, నాకు ఇష్టమైన ఫుడ్ మన సంప్రదాయ హైదరాబాద్ బిర్యానీ’ అని మహేష్ అన్నారు. అలాగే మరో అభిమాని ‘మీకు బాగా ఇష్టమైన గేమ్ ఏమిటి సార్.. అని అడగగా.. ‘నేను బాగా ఎంజాయ్ చేసేది ఆన్ లైన్ లో మా అబ్బాయి గౌతమ్ తో ఆడే టెన్నిస్, బేస్ బాల్, గోల్ఫ్’ అని అన్నారు. భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అని మరో ప్రశ్న అడగ్గా.. ఖచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తాను. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అని పేర్కోన్నారు. ఇక పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాటలో మహేష్ మూడు రోల్స్ చేయనున్నాడని.. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ నటించనుందని సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: June 1, 2020, 7:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading