తమన్నా పాటకు డాన్స్ ఇరగదీసిన మహేష్ కూతురు.. వీడియో వైరల్..

మహేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అని తెలిసిందే.

news18-telugu
Updated: February 14, 2020, 9:16 AM IST
తమన్నా పాటకు డాన్స్ ఇరగదీసిన మహేష్ కూతురు.. వీడియో వైరల్..
Instagram
  • Share this:
మహేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అని తెలిసిందే. సితార, తన ఫ్రెండ్ వంశీ పైడిపల్లి కూతురు ఆధ్యతో కలిసి యూట్యూబ్‌లో‘ఏ అండ్‌ ఎస్‌’ అనే ఛానల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి రకరకాల వీడియోలు చేస్తూ.. వాటిని తమ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అది అలా ఉంటే సితార వీలున్నప్పుడల్లా తన డ్యాన్స్‌తో అదరగొడుతోంది. ఆ మధ్య బాహుబలి సాంగ్‌కు డాన్స్ వేసి అదరగొట్టిన సితార తాజాగా తన తండ్రి తాజా సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని తమన్నా తన డ్యాన్స్‌తో అదరగొట్టిన డాంగ్ డాంగ్ సాంగ్‌కు డాన్స్‌ను ఇరగదీసింది. ఆ పాటలో తమన్నా ధరించిన కాస్ట్యూమ్ స్టైల్‌లోనే సితార కూడా డాంగ్ డాంగ్ పాటకి సూపర్ స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ఈ వీడియోను నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అదే వీడియోను తమన్నా కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది అలా ఉంటే తన ఫ్యామిలీతో లాంగ్ వెకేషన్‌లో ఉన్న మహేష్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. రెండు నెలలకు పైగా అక్కడ గడపనున్న మహేష్ మే నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమా మాఫియా బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించనున్నాడు.
View this post on Instagram

absolutely nailed it💃💃👏👏 #SarileruNeekevvaru


A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on


Published by: Suresh Rachamalla
First published: February 14, 2020, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading