Alia Bhatt : అలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చారు. అయిన తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తున్నారు. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మంచి హిట్ తెచ్చుకుని అదరగొట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అలియాకు వరుసగా అవకాశాలొచ్చాయి. అందులో భాగంగా ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాల్లో ప్రధాన పాత్రలు చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRలో కూడ నటిస్తోంది. రామ్ చరణ్‌తో రొమాన్స్ చేయనుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం బీంగా చేస్తున్నారు. అది అలా ఉంటే అలియా తండ్రి మహేష్ భట్ హిందీలో నిర్మాతగాను దర్శకుడిగాను పరిచయమే. అయితే తాజాగా మహేష్ భట్ తన కూతురు షాహిన్ భట్ ఓ పుస్తక ఆవిష్కరణలో కొంత అసహనానికి గురైయాడు. వివరాల్లోకి వెళితే.. షాహిన్ భట్.. తనకు జరిగిన మెంటల్ ఇల్నెస్ గురించి ఓ పుస్తకం రాసింది. ఈ పుస్తక ఆవిష్కరణకు మహేష్ భట్‌తో పాటు తన కుటుంబం అంత హాజరైయారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సహనం కోల్పోయిన భట్.. మీడియాపై అరిచాడు. ఈ సందర్భంగా అలియా కలగజేసుకొని శాంతించాలంటూ సైగలు చేసిన వినిపించుకోని భట్ అలానే అరవడం చేశాడు. దీంతో అలియా కొంత అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.