ముగిసిన మహేష్ బాబు..‘మహర్షి’ థియేట్రికల్ రన్.. ఇంతకీ ఎంత వసూలు చేసిందంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘మహర్షి’. ఈ సమ్మర్లో మే 9న విడుదలైన ఈ సినిమా వివిధ వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.
news18-telugu
Updated: July 5, 2019, 7:28 AM IST

మహర్షి సినిమా కలెక్షన్స్
- News18 Telugu
- Last Updated: July 5, 2019, 7:28 AM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘మహర్షి’. ఈ సమ్మర్లో మే 9న విడుదలైన ఈ సినిమా వివిధ వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిినిమా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కావడంతో...తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల షేర్‌ను వసూలు చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమాలో మహేష్ బాబు విభిన్న కోణాల్లో యాక్ట్ చేసి మెప్పించాడు. ఒక కార్పోరేట్ సంస్థకు అధిపతిగా, కాలేజీ విద్యార్థిగా మెప్పించాడు. ముఖ్యంగా రైతాంగ సమస్యను ఈ సినిమాలో అంతర్లీనంగా చెప్పడం ఈ సినిమా విజయంలో కీలకంగా మారింది. ఈ సినిమా రూ.101 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. ఓవరాల్‌గా రూ.105 కోట్లను రాబట్టింది. సీడెడ్ మరియు ఓవర్సీస్లో మాత్రం అనుకున్నంత రేంజ్లో వసూళ్లను కురిపించలేకపోయిది. ఇక డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో నిర్మాతకు మంచి లాభాలే దక్కాయి. ప్రస్తుతం మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను చేస్తున్నాడు. ఈ సిినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్.. ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
బాగా ఫీల్ అయిపోతున్న మహేష్ బాబు...
రియల్ హీరో మహేష్ బాబు... 13నెలల చిన్నారికి గుండె ఆపరేషన్
రష్మిక అంటేనే ... భయపడుతున్న మహేష్ బాబు
భూమిపై ఇదే నా పేవరేట్ ప్లేస్... మహేష్ బాబు ట్వీట్
మహర్షి భామ మీనాక్షి దీక్షిత్ స్పైసీ ఫోటో షూట్.. కిక్కెస్తున్న అందాలు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త వ్యాపారం...ఏంటో తెలుసా..?