దోచుకుంటున్న మహేష్ బాబు.. ‘మహర్షి’ సాక్షిగా మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకుల నిలువు దోపిడి..

మహర్షి సినిమా

అవును ‘మహర్షి’ మూవీ సాక్షిగా ప్రేక్షకులను అడ్డగోలుగా నిలువు దోపిడికి సిద్ద పడ్డారు ఈ చిత్ర నిర్మాతలు. మొదటి రోజు మొదటి ఆట చూడాలనుకునే అభిమానుల ఆరాటాన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ క్యాష్ చేసుకుంటున్నారు.

  • Share this:
అవును ‘మహర్షి’ మూవీ సాక్షిగా ప్రేక్షకులను అడ్డగోలుగా నిలువు దోపిడికి సిద్ద పడ్డారు ఈ చిత్ర నిర్మాతలు. మొదటి రోజు మొదటి ఆట చూడాలనుకునే అభిమానుల ఆరాటాన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. అంతేకాదు అందినంత వరకు  అభిమానులను నిలువు దోపిడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హీరోగా ఇది మహేష్ బాబుకు 25వ సినిమా కావడంతో ‘మహర్షి’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దర్శకుడిగా వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డు కూడా బాగుంది. ఆల్రెడి విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజ్‌‌లో జరిగింది. అంతేకాదు యూఎస్‌లో మహేష్ బాబు సినిమాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ రకంగా యూఎస్‌లో ప్రీమియర్స్‌తోనే ‘బాహుబలి’ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.

Mahesh babu's Maharshi movie Ticket price increased in hyderabad multiplex and single screen theatres.. here are the details,maharshi movie review,maharshi movie ticket price increased,maharshi movie ticket rates hike,maharshi movie ticket rate issue,multiplex,andhra pradesh news,andhra pradesh politics,mahesh babu updates,mahesh babu movie,mahesh babu pooja hegde,mahesh babu allari naresh,మహేష్ బాబు,మహేష్ బాబు మహర్షి టికెట్ రేట్స్ హైక్,మహేష్ బాబు టికెట్ రేట్ హైక్స్,మహర్షి మూవీ రివ్యూ,మహర్షి మూవీ మల్టీప్లెక్స్ దోపిడి,మహర్షి సింగిల్ స్క్రీన్ దోపిడి,
‘మహర్షి’


మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌లతో పాటు మామూలు థియేటర్స్‌లో సాధారణంగా ఉన్న రేట్ల కన్న ఎక్కువ రేట్లకు టికెట్స్‌ను అమ్ముతున్నారు. ప్రసాద్ లాంటి మల్టీప్లెక్స్‌లో మాములుగా ఐతే ఒక టికెట్ ధర రూ.150 కానీ ‘మహర్షి’ సినిమాకు మాత్రం రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ విషయానికొస్తే.. రూ.100 టికెట్‌ను రూ.125కు అమ్ముతూ ప్రేక్షకులను నిలువు దోపిడి చేస్తున్నారు. సాధారణంగా ఏదైనా సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి గవర్నమెంట్ నుంచి స్పెషల్ పర్మిషన్ ఇస్తూ జీవో కూడా జారీ చేసింది. ఇప్పటికే పెరిగిన టికెట్ రేట్స్ పై సిని ప్రియులు మండిపడుతున్నారు. సమ్మర్‌లో కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునే ఒక్కో ఫ్యామిలీకి రూ.200 నుంచి రూ. 250 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. అంతేకాదు ఐదు ఆటలకు నడపడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టికెట్స్ కోసం ఎదురుచూసే మహేష్ బాబు అభిమానులకు ఊరట.
First published: