‘మహర్షి’కి గుమ్మడికాయ కొట్టేసిన మహేష్ బాబు..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 18, 2019, 12:00 PM IST
‘మహర్షి’కి గుమ్మడికాయ కొట్టేసిన మహేష్ బాబు..
‘మహర్షి’లో మహేష్ బాబు
  • Share this:
ప్రస్తుతం మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తైయినట్టు మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ‘ఇట్స్ ఏ ర్యాప్’ అని కేక్ ను ట్వీట్ చేసాడు. అంతేకాదు మిమ్మల్ని మే 9న థియేటర్స్‌లో కలవబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో మహేష్ బాబు.. అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్‌గా నటించాడు. మరోవైపు అతని స్నేహితుడిగా అల్లరి నరేష్ యాక్ట్ చేసాడు. స్నేహితుడి కోసం ఇండియాకు వచ్చిన మహేష్ బాబు..ఆ తర్వాత ఏం చేసాడనేది ‘మహర్షి’ సినిమా స్టోరీ. ఈ సినిమాలో మహేష్ బాబు రిషి పాత్రలో నటిస్తున్నాడు.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
View this post on Instagram

With this... It's a wrap!!! See you in the cinemas on May 9th 😊😊😊 #Maharshi #MaharshionMay9th


A post shared by Mahesh Babu (@urstrulymahesh) on


స్నేహం,కుటుంబ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాను దిల్ రాజు, సి.అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 18, 2019, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading