‘మహర్షి’ నుంచి పదర..పదర సాంగ్ విడుదల..రైతుగా అదరగొట్టిన మహేష్ బాబు..

మహర్షి చిత్రంలో మహేష్ బాబు

ప్రస్తుతం మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా కంప్లీట్ చేసాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్‌ పాత్రలో కనిపించనున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి పదర పదర సాంగ్ రిలీజ్ చేసారు.

  • Share this:
ప్రస్తుతం మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా కంప్లీట్ చేసాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్‌ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు అతని స్నేహితుడిగా అల్లరి నరేష్ యాక్ట్ చేసాడు. స్నేహితుడి కోసం ఇండియాకు వచ్చిన మహేష్ బాబు..ఆ తర్వాత ఏం చేసాడనేది ‘మహర్షి’ సినిమా స్టోరీ. ఈ సినిమాలో మహేష్ బాబు రిషి పాత్రలో నటించాడు.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే నెల  9వ విడుదల కాబోతున్న ‘మహర్షి’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌తో పాటు ఎవరెస్ట్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘పదరా పదరా’ నీ అడుగుకు పదును పెట్టి  .. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా అనే  లిరికల్ సాంగ్ విడుదల చేసారు. 


శ్రీమణి రాసిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన టూన్స్ అందించాడు. శంకర్ మహదేవన్ అదే రేంజ్‌లో పాడారు. ఈ సినిమాను దిల్ రాజు, సి.అశ్వనీదత్.పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. హీరోగా మహేష్ బాబుకు ఇది 25వ  సినిమా. మరి ఈ సినిమాతో మహేష్ హీరోగా మరో సక్సెస్‌ను అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
First published: