‘మహర్షి’ సినిమాతో మహేష్ బాబు సంచలనాలు.. ఇంతకీ ఏమిటో తెలుసా..

మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌‌ను సాధించిన ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఎన్నో రికార్డ్స్‌ను బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది.

news18-telugu
Updated: May 16, 2019, 7:31 AM IST
‘మహర్షి’ సినిమాతో మహేష్ బాబు సంచలనాలు.. ఇంతకీ ఏమిటో తెలుసా..
మహర్షి సినిమా పోస్టర్
news18-telugu
Updated: May 16, 2019, 7:31 AM IST
మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌‌ను సాధించిన ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను కురిపిస్తోంది. స్నేహం, సామాజిక ఇతివృత్తం, సందేశాత్మకంగా ఉన్న  ఈ సినిమాకు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిపస్తున్నారు.‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాల దత్తత అంశాన్నితీసుకొన్న మహేష్ బాబు.. ఆ తర్వాత ‘భరత్ అను నేను’ సినిమాలో రాజకీయాలను సృశించింది. తాజాగా ‘మహర్షి’ సినిమాను చూసి ఏకంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ  చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు. రూ.100 కోట్లు వసూళు చేసిన  మహేష్‌బాబు ఐదో చిత్రం ఇది. ఓవరాల్‌గా రూ.75 కోట్ల షేర్ వసూలుచేసిన ఈసినిమా ఇంకా సేఫ్ జోన్‌లోకి రావాలంటే ఇంకా రూ.25 కోట్లు కావాలి. ఇప్పటికే నైజాంలో ఈ సినిమా రూ.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ‘దూకుడు’ సినిమాతో తొలిసారి రూ.100 కోట్ల గ్రాస్ వసూళు చేసిన మహేష్ బాబు.. ఆ తర్వాత శ్రీమంతుడు,‘స్పైడర్’ తెలుగు, తమిళ వెర్షన్‌లో వంద కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఆ తర్వాత ‘భరత్ అను నేను’ తాజాగా ‘మహర్షి’ తో వందకోట్ల గ్రాస్ అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.

Mahesh babu's Maharshi movie Created Records in Tollywood Box Office,maharshi,mahesh babu twitter,mahesh babu instagram,maharshi movie records,maharshi movie created record,maharshi nizam record collections,maharshi entered in to rs 100 crore club,overseas 9th movie,maharshi twitter,maharsh 1st week ww collection,maharshi 100 crore club,maharshi 100 crore collections,maharshi 4 days collections,maharshi 3 days us collection,maharshi collection,maharshi box office collection,maharshi movie,maharshi movie US collections,maharshi 2nd day collection,maharshi movie box office collections,maharshi 3 days collection,maharshi movie 3 days ww collections,maharshi movie updates,maharshi day 3 collections,maharshi collections,maharshi,maharshi worldwide collection,maharshi overseas collections,maharshi 3rd day box office collection,maharshi day collections,telugu cinema,మహర్షి,మహర్షి కలెక్షన్స్,మహర్షి మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్,మహర్షి మూడు రోజుల కలెక్షన్స్,మహర్షి మూడు రోజుల యుఎస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మహర్షి సినిమా కలెక్షన్స్


అలాగే ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్స్ వసూలు చేసిన చిత్రాలు మహేష్ బాబువి తొమ్మిది సినిమాలు ఉండటం విశేషం. ‘దూకుడు’,‘ఆగడు’,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నేనొక్కడినే’, ‘శ్రీమంతుడు’,‘బ్రహ్మోత్సవం’,‘స్పైడర్’ ‘భరత్ అను నేను’, ‘మహర్షి’సినిమాలు వన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం మహేష్ బాబకున్న క్రేజ్‌కు నిదర్శనం. ఇక ఈ సినిమాతో మహేష్ బాబుకు ‘మే’ నెల కలిసిరాదన్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేసాడు. మొత్తానికి ఒక్క ‘మహర్షి’ సినిమాతో మహేష్ బాబు ఎన్నో రికార్డులను నెలకొల్పాడు.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...