మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా కంప్లీట్ చేసాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు అతని స్నేహితుడిగా అల్లరి నరేష్ యాక్ట్ చేసాడు. స్నేహితుడి కోసం ఇండియాకు వచ్చిన మహేష్ బాబు..ఆ తర్వాత ఏం చేసాడనేది ‘మహర్షి’ సినిమా స్టోరీ. ఈ సినిమాలో మహేష్ బాబు రిషి పాత్రలో నటించాడు.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ఫైనల్ కాపీ రెడీ అయిందట. రెండు రోజుల క్రితమే ఫైనల్ కాపీ రెడీ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా రన్ టైమ్ దాదాపు 170 నిమిషాలున్నట్టు చెబుతున్నారు. అంటే పది నిమిషాలు తక్కువ మూడు గంటలు అన్నమాట. ముందుగా నాలుగు గంటల ఔట్ పుట్ వస్తే..తాజాగా ఎడిటింగ్ చేసి 2గంటల 50 నిమిషాలకు కుదించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాలుగు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా దిల్ రాజు స్టార్ట్ చేసాడు.
ఇక మే డే కానుకగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించననున్నారు. హీరోగా మహేష్‌బాబుకు 25వ సినిమా కాబట్టి ఈ ఫంక్షన్‌కు మహేష్ బాబుతో పనిచేసిన దర్శకులందరు ఒకే వేదిక పైకి రానున్నట్టు సమాచారం. ఇక ‘మహర్షి’ సినిమ ా షూటింగ్ పూర్తి కావడంతో ఫ్యామిలీతో కలిసి పారిస్ టూర్‌కు వెళ్లాడు మహేష్ బాబు. ఈ సినిమాను మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: #Maheshbabu25, Maharshi, Maharshi Movie Review, Mahesh babu, Mahesh Babu Latest News, Telugu Cinema, Tollywood