సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) ప్రస్తుతం డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata shoot)పేరుతో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సర్కారు వారి పాట తాజా షెడ్యూల్ ఇటీవల గోవాలో మొదలైన సంగతి తెలిసిందే. అక్కడ 15రోజుల పాటు షూటింగ్ చేసిన చిత్రబృందం.. గోవా షెడ్యూల్‌ను కంప్లీట్ చేసింది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల (Keerthy suresh)పై కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో మొదలుకానుంది. గోవా షెడ్యూల్ ముగియడంతో మహేష్ బాబు సతీమణి నమ్రత ఓ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ ఫోటో మహేష్ సోదరి మంజుల, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(vamshi paidipally) ఉన్నారు. గోవా నుంచి వీరు ప్రత్యేక విమానంలో ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.
ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఇక ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Mahesh Babu, Tollywood news