బర్త్ డే విషెస్: ‘నా రియల్‌ హీరో.. నా మెంటర్‌’

Sunil Kumar Jammula | news18
Updated: May 31, 2018, 11:04 AM IST
బర్త్ డే విషెస్: ‘నా రియల్‌ హీరో.. నా మెంటర్‌’
  • News18
  • Last Updated: May 31, 2018, 11:04 AM IST
  • Share this:
నేడు సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ , అక్కినేని లతో పోటీపడి రాణించిన హీరో కృష్ణ . సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించిన కృష్ణ హీరోగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా విభిన్న పార్శ్వాలను స్పృశించాడు . 75 ఏళ్లను పూర్తిచేసుకొని 76 వ వసంతంలోకి అడుగుపెట్టాడు కృష్ణ .

మహేష్‌ తన తండ్రికి ట్విట్టర్ లో బర్త్‌డ్‌ విషెస్‌ చెబుతూ...  ‘  నా రియల్‌ హీరో.. నా మెంటర్‌.. నా ఆలోచన... నా బలం.. ప్రతీది నువ్వే. నీ కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది. హ్యాపి బర్త్‌డే నాన్న. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ సుపర్‌స్టార్‌ మీరే’  అంటూ ట్వీట్‌ చేశాడు.


కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఉదయాన్నే విషెస్‌ తెలిపి, తండ్రితో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇక కృష్ణ వీరాభిమాని , తెలుగు సినిమారంగంలో స్టార్ పి ఆర్ ఓ గా రాణిస్తున్న బి ఏ రాజు చాలా ఇంట్రెస్టింగ్ గా తన అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశాడు . కృష్ణ పుట్టినరోజున విడుదలైన అయన  చిత్రాలను ఉదహరిస్తూ గ్రీటింగ్స్ తెలిపాడు . మే 31న కృష్ణ పుట్టినరోజు కాగా ఆ రోజున విడుదలైన చిత్రాలు ఇలా ఉన్నాయి .

1) తల్లీ కొడుకులు – 31 – 05 – 1973 ( నేటికి 45 ఏళ్ళు పూర్తి )
2) మనుషులు మట్టి బొమ్మలు – 31- 05- 1974 ( నేటికి 44 ఏళ్ళు పూర్తి )
3) కొత్త అల్లుడు – 31- 05- 1979 (నేటికి 39 ఏళ్ళు పూర్తి )
4) రామ్ రాబర్ట్ రహీం – 31- 05- 1980 ( నేటికి 38 ఏళ్ళు పూర్తి )

 

ఇక కృష్ణ బర్త్ డే పలువురు  సెలెబ్రిటీలు ట్విట్టర్ లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.First published: May 31, 2018, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading