Mahesh Babu : ఉత్తమ నటుడిగా మహేష్ బాబు.. మహర్షి సినిమాకు మూడు అవార్డ్స్..

Mahesh Babu wins Best Actor for Maharshi Photo : Twitter

Mahesh Babu : సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్‌కు సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ అవార్డ్స్ వేడుకలో 2019 సంవత్సరానికి గాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలిచారు.

 • Share this:
  సూపర్ స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu )హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సందేశాత్మక చిత్రం 'మహర్షి'. ఈ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలై రెండేళ్లు అవుతోన్న ఇంకా అవార్డులు, ప్రశంసలు అందుకుంటూనే ఉంది. తాజాగా నిన్న సాక్షి ఎక్సలెన్స్  (Sakshi Excellence Awards) అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్‌కు సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ అవార్డ్స్ వేడుకలో 2019 సంవత్సరానికి గాను సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించనుందుకు ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలిచారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు వచ్చి స్వయంగా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 'మహర్షి' ఉత్తమ నటుడి అవార్డ్‌తో పాటు మరో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకుంది. 2019 లో విడుదలైన సినిమాలలో ఈ మహర్షి సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అవార్డు అందుకున్నారు. ఇక 'మహర్షి' సినిమాకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లికి (vamshi paidipally) ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది.

   సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్..

  ఇదే వేడుకలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే (Pooja Hegde) ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రం అవార్డును అల వైకుంఠపురములో నిర్మాత రాధా కృష్ణ అందుకున్నారు. థమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు గెలిచారు.


  మహేష్ బాబు నటిస్తున్న సినిమాలు..

  ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమా విషయానికి వస్తే.. ఆయన పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో వస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

  Pooja Hegde : పూజా హెగ్డేకు ఉత్తమ నటి అవార్డ్.. మురిసిపోయిన ముద్దుగుమ్మ..

  ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా ఆడియో రైట్స్‌ను సరిగమ సౌత్ దక్కించుకుంది. అయితే ఈ ఆడియో రైట్స్ కోసం సరిగమ సౌత్ నాలుగునర కోట్లు చెల్లించుకుందట. ఇదే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఒక నాన్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో అత్యధికం అన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది.

  Love Story : లవ్ స్టోరి సినిమాకు భారీ బుకింగ్స్.. లాక్ డౌన్ తర్వాత మొదటిసారి ఈ రేంజ్‌లో..

  ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.

  టెక్నికల్ టీమ్..

  ఈ చిత్రానికి మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది.

  మహేష్‌తో రాజమౌళి..

  ఈ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.  ఈ సినిమాతో పాటు మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారట. ఓ హీరోయిన్‌గా త్రిషను చిత్రబృందం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్‌గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నారట.
  Published by:Suresh Rachamalla
  First published: