NTR | Mahesh Babu : ఎన్టీఆర్ షోలో పాతిక లక్షలు గెలిచిన మహేష్ బాబు.. ప్రసారం ఎప్పుడంటే..

NTR, Mahesh Babu Photo : Twitter

NTR | Mahesh Babu : ఎన్టీఆర్ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే “మీలో ఎవరో కోటీశ్వరులు” అనే షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జెమిని టీవీలో “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే గేమ్ షో ద్వారా ప్రతి రోజు టీవీ తెరపై కనిపిస్తూ అలరిస్తున్నారు. కాగా ఇదే షోకు మహేష్ బాబు గెస్ట్’గా వస్తున్నట్లు టాక్ నడిచింది.

  • Share this:
    యంగ్ టైగర్ఎన్టీఆర్ (NTR) ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే జెమినీ టీవీలో వచ్చే “మీలో ఎవరో కోటీశ్వరులు”   (Evaru Meelo Koteeswarulu) షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆయన తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఈ షోకు గతంలో ఎన్నడు లేని విధంగా టీఆర్ఫీలను తెచ్చిపెడుతున్నారు. ఇక అది అలా ఉంటే.. ఎన్టీఆర్ షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు.. టీఆర్పీ రికార్డ్స్‌ బద్దలుకొట్టాడనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబందించిన షూట్ కూడా ఇటీవలే జరిగినట్లు సమాచారం. ప్రేక్షకులకు మరింత వినోదం అందించే ఉద్ధేశ్యంలో భాగంగా షో నిర్వాహకులు మధ్య మధ్యలో పలువురు సినీ ప్రముఖులను షోలోకి గెస్టులుగా తీసుకొస్తున్నారు. ఈ షో ప్రారంభించిన మొదటి రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా తీసుకువచ్చారు. అంతేకాదు ఆయన షోలో ప్రశ్నలకు జవాబులు చెప్పి 25 లక్షలు గెలుచుకుని అదరగొట్టారు.

    ఇక ఇటీవల తెలుగు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ గెస్ట్‌లుగా వచ్చి అలరించారు. అది అలా ఉంటే తెలుగు సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ షోకి వస్తున్నట్లు ఇటీవల వార్తలతో పాటు కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

    పాతిక లక్షలు గెలిచిన మహేష్ బాబు..

    కాగా లేటెస్ట్ సమాచారం మేరకు మ‌హేష్ బాబు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి హాజరై.. పాతిక ల‌క్ష‌ల రూపాయ‌లు గెలుచుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌ను.. మొన్న ఆదివారమే ఈ షూట్ కంప్లీట్ చేశారని సమాచారం. ఈ ఎపిసోడ్ దసరా పండుగకు ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది.

    Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ధర ఎంతో తెలిస్తే...పట్టపగలే చుక్కలు కనపడతాయి..

    ఈ ఇద్దరు ఒకేసారి ఒకే షోలో కనిపించడం అంటే రేటింగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు నెటిజన్స్. ఇక ఇదే షోను గతంలో నాగార్జున‌, చిరంజీవి 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ మాటీవీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అదే షోను జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' పేరుతో ప్రసారం అవుతోంది.

    ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే..

    ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం అగ్రదర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం RRR “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని గతంలో ప్రకటించినా.. తాజాగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీగా చెయ్యబోతున్నారు.

    ఎన్టీఆర్ 30లో కియారా అద్వానీ (Kiara advani) నటిస్తుందని టాక్ రాగా.. ఆమె స్థానంలో పూజ హేగ్డే  (Pooja Hegde )వచ్చి చేరింది అని తాజా సమాచారం. అంతేకాదు ఎన్టీఆర్ 30 లో పూజ హెగ్డే దాదాపు ఖరారు అయినట్లేనట. ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లో కూడా పూజాకు భారీ క్రేజ్ ఉండడంతో దర్శక నిర్మాతలు పూజా వైపు చూస్తున్నారట. ఈ విషయంలో అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.

    ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తుండడంతో.. విలన్ గా ఓ బాలీవుడ్ స్టార్ ను కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. దీనిపై కొంత క్లారిటీ రావాలసిఉంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ.. ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు.

    Ishwari Deshpande : సినీ పరిశ్రమలో విషాదం.. బాయ్ ఫ్రెండ్‌తో షికారుకు వెళ్లి కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన హీరోయిన్..

    ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తున్నారు.

    మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే..

    ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో వస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.  ఈ సినిమాతో పాటు మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published: