Home /News /movies /

MAHESH BABU WIFE NAMRATA WATCHING SARKARU VAARI PAATA MOVIE IN SUDARSHAN THEATRE 35MM SB

Mahesh Babu: సుదర్శన్ థియేటర్‌లో నమ్రత.. మహేష్ డైలా‌గ్స్‌కు నవ్వులే నవ్వులు..

థియేటర్‌లో నమ్రత

థియేటర్‌లో నమ్రత

మహేష్ సినిమా చూసేందుకు హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌కు వెళ్లినట్లు నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.ఆడియన్స్ మధ్య కూర్చొని సినిమా చూస్తూ నమ్రత ఎంజాయ్ చేశారు.

    సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మహేష్ మాస్ డైలాగ్స్ చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మహేష్ సినిమా కేవలం రెండు రోజుల్లో  మంచి కలెక్షన్స్ సాధించింది. సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉండనుంది. అంతేకాదు ఈ సినిమాకు సెన్సార్ U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది.

    బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ల రాబడుతుడుతూ దూసుకుపోతోంది. అయితే సినిమా విడుదలైనప్పటినుంచే మహేశ్ బాబు అభిమానులతో థియేటర్‌‌లు కిటకిటలాడుతున్నాయి. తాజాగా ఈ మూవీని మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సర్కారు వారి పాట సినిమాను చూశారు. ఈ సినిమాను చూసేందుకు నమ్రతా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సుదర్శన్‌ 35 ఎంఎం థియేటర్‌కు వెళ్లారు. నమ్రతను చూసిన అభిమానులు థియోటర్‌‌లో సందడి చేశారు. నమ్రతతో థియేటర్ నిర్వాహకులు,యజమానులు కేక్ కట్ చేయించారు.



    థియేటర్లో కూర్చునొ ఆడియన్స్ మధ్య ఒక ప్రేక్షకురాలిగా నమ్రత సినిమాను చూస్తూ ఎంజాయ్ చేశారు.మహేష్ డైలాగ్స్‌కు నవ్వుతూ సందడి చేశారు. ఇదిలా ఉంటే ఫుల్‌ క్రౌడ్‌ ఉన్న ఆ థియేటర్లలో సందెట్లో సడేమియాలా జేబు దొంగలు చేతివాటం చూపించారు. ఓ వ్యక్తి జేబులో నుంచి పర్సు కొట్టేశారు. అందులో రూ. 2800 నగదు ఉన్నట్లు సమాచారం. తర్వాత అక్కడ కొద్దిసేపు పలువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

    మరోవైపు సర్కారు వారి పాట  సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. హీరోగా 27వ చిత్రం. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది.  ఈ సినిమాకు యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mahesh Babu, Namrata Shirodkar, Sarkaru Vaari Paata

    తదుపరి వార్తలు