హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: మహేష్ బాబు వదినా మజాకా.. సినీ పరిశ్రమలో ఆ రికార్డు క్రియేట్ చేసిన తొలి మహిళగా.. 

Mahesh Babu: మహేష్ బాబు వదినా మజాకా.. సినీ పరిశ్రమలో ఆ రికార్డు క్రియేట్ చేసిన తొలి మహిళగా.. 

తన గారాల పట్టి సితారతో కలిసి ఈ ఫోటోకు పోజిచ్చాడు సూపర్ స్టార్. అందులో మహేష్ బాబును చూసి వయసు దాచేసే యంత్రం ఏదైనా మీ దగ్గర ఉండిపోయిందా మహేష్ అంటూ అడుగుతున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ పూర్తిగా న్యూ లుక్‌లో అదరగొడుతున్నాడు.

తన గారాల పట్టి సితారతో కలిసి ఈ ఫోటోకు పోజిచ్చాడు సూపర్ స్టార్. అందులో మహేష్ బాబును చూసి వయసు దాచేసే యంత్రం ఏదైనా మీ దగ్గర ఉండిపోయిందా మహేష్ అంటూ అడుగుతున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ పూర్తిగా న్యూ లుక్‌లో అదరగొడుతున్నాడు.

Mahesh Babu: మహేష్ బాబు వదినా మజాకా.. సినీ పరిశ్రమలో ఆ రికార్డు క్రియేట్ చేసిన తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

  Mahesh Babu: మహేష్ బాబు వదినా మజాకా.. సినీ పరిశ్రమలో ఆ రికార్డు క్రియేట్ చేసిన తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇక మన శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. ఇప్పటికే పలు సంస్థలు ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్‌కు కేంద్రంతో పాటు ఆయా దేశాలు అనుమతులు కూడా మంజూరు చేసాయి. ఇప్పటికే మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన హెల్త్ వాలంటీర్లకు డ్రై రన్ కూడా నిర్వహించారు. ఈ నెలలోనే మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారా మిలీటరీ దళాలు, మున్సిపల్ శాఖలో శానిటేషన్ విధులు నిర్వహిస్తున్నవారు.. వృద్ధులకు ఈ టీకా ముందుగా ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.

  ఐతే.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తొలి భారతీయ నటిగా మహేష్ బాబు భార్య నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ నిలిచారు. ఈమె ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. 51 ఏళ్ల శిల్పా యూఏఈలో కోవిడ్‌కు సంబంధించిన వ్యాక్సిన్ తీసుకున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.


  ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ యూఏఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. శిల్పా శిరోద్కర్ బాలీవుడ్‌లో పలు  సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందులో ‘హమ్’, ‘గోపీ కిషన్’, కిషన్ కన్హయ్య’ బేవాఫా సనమ్’ వంటి సినిమాలున్నాయి. తెలుగులో కూడా ఈమె మోహన్ బాబు హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మ’ సినిమాలో కథానాయికగా నటించింది. హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే.. 200 సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన అపరేష్ రంజిత్‌‌ను పెళ్లి చేసుకుంది. వివాహాం అయిన కొన్నేళ్ల తర్వాత 2013లో ‘ఏక్ ముట్టి ఆస్మాన్’ అనే సీరియల్‌లో నటించింది. ఈమె మహేష్ బాబు భార్య నమ్రతకు స్వయానా సోదరి అన్న సంగతి తెలిసిందే కదా.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Corona Vaccine, Covid-19, Mahesh babu, Namrata

  ఉత్తమ కథలు