అవునా.. మహేష్ బాబుకు రెండో భార్య ఉందా.. అయినా కూడా ఆ విషయం నమ్రతా శిరోద్కర్ చెప్పిందా..? ఏం మాట్లాడుతున్నారు.. అసలు మహేష్ బాబుపై కనీసం ఒక్కసారి కూడా అలాంటి కామెంట్స్ రాలేదు కదా.. మరి ఇదేంటి అనుకుంటున్నారా..? తెలుగు ఇండస్ట్రీలో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో ముందుండేది మహేష్ బాబు. ఆయనకు సినిమాలు తర్వాత.. ముందు ఫ్యామిలీనే ముఖ్యం. సెలవులు లేకపోయినా కూడా షూటింగ్స్ ఆపేసి మరీ కుటుంబం కోసం సమయం కేటాయిస్తుంటాడు సూపర్ స్టార్. అలాంటి మహేష్ బాబుకు రెండో భార్య ఏంటి అనే ఆశ్చర్యం అందర్లోనూ ఉండొచ్చు అయితే నమ్రత చెప్పింది విన్న తర్వాత అది నిజమే అని నమ్మక తప్పదు.
ఈ మధ్యే 15వ వివాహ మహోత్సవం జరుపుకున్నారు మహేష్ నమ్రత జోడీ. ఒకరికొకరం దొరకడం నిజంగా దేవుడు ఇచ్చిన వరం అంటూ ఇద్దరూ పొగిడేసుకున్నారు. ఆ సందర్భంలోనే మహేష్ బాబు ఎంత మంచివాడు అనేది సన్నిహితులతో నమ్రత చెప్పిందని తెలుస్తుంది. మహేష్ బాబుకు తాను రెండో భార్య అని.. తన మొదటి భార్య సినిమాలే అని నమ్రత చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. సినిమాలను మహేష్ అంత ప్రాణంగా ప్రేమిస్తాడని.. ఆయన తొలి భార్య సినిమాలు లేకుండా ఉండలేడని చెబుతుంది ఈమె.
సినిమాలను ఎంత ప్రాణంగా చూసుకుంటాడో.. తమను కూడా అంతకంటే ఎక్కువ ప్రాణంగా చూసుకుంటాడని.. అందుకే ఆయనకు ఇద్దరు భార్యలు అని నమ్రత చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబానికి అంత ప్రాముఖ్యత ఇస్తాడు కాబట్టే టాలీవుడ్ మోస్ట్ ఫ్యామిలీ పర్సన్ అయిపోయాడు సూపర్ స్టార్. రెండో భార్య అని కాస్త కంగారు పెట్టినా కూడా మహేష్ గురించి తెలిసిన తర్వాత అభిమానులు కూడా నువ్వు సూపర్.. సూపర్ స్టార్ అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh babu, Namratha Shirodkar, Telugu Cinema, Tollywood