హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu-Namrata: కుటుంబ సభ్యులతో మహేష్ బాబు డిన్నర్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన నమ్రత..

Mahesh Babu-Namrata: కుటుంబ సభ్యులతో మహేష్ బాబు డిన్నర్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన నమ్రత..

ఫ్యామిలీ మెంబర్స్‌తో మహేష్ బాబు (Instagram/Photo)

ఫ్యామిలీ మెంబర్స్‌తో మహేష్ బాబు (Instagram/Photo)

Mahesh Babu-Namrata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు‌ తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫారెన్‌లో సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో డిన్నర్ చేస్తోన్న ఫోటోను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇంకా చదవండి ...

  Mahesh Babu-Namrata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు‌ తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి వీలైన ప్రతి చోట తన కుమార్తె సితారతో పాటు కుమారుడు గౌతమ్ కృష్ణతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. తాజాగా తన అబ్బాయి గౌతమ్ కృష్ణతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్  చేశాడు. మరోవైపు ఫారెన్‌ టూర్‌లో భాగంగా తన తోడల్లుడు నమ్రత శిరోద్కర్ అక్క శిల్పా శిరోద్కర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ భర్త అప్రేశ్ రంజిత్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సందడి చేసారు. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి డిన్నర్ చేసిన ఫోటోను నమ్రత అభిమానులతో షేర్ చేసుకుంది.


  సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికొస్తే.. ఈయన హీరోగా నిర్మాతగా రాణిస్తున్నాడు. ఈయన అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా నిర్మిస్తున్నాడు. 26/11 దాడుల్లో అమరుడైన ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. మరోవైపు మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ.. తన బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా లేకపోతే.. ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ షూటింగ్ కంప్లీటో కూడా అయ్యేది. కానీ ఈ సినిమాను వచ్చే యేడాది జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను అమెరికా నేపథ్యంలో బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Gautham Krishna, Mahesh babu, Mahesh Babu Daughter Sitara, Namrata, ParasuRam, Sarkaru vaari pata, Tollywood

  ఉత్తమ కథలు