హోమ్ /వార్తలు /సినిమా /

Namrata Mahesh: తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన మహేష్ బాబు భార్య నమ్రత..

Namrata Mahesh: తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన మహేష్ బాబు భార్య నమ్రత..

Namrata Mahesh: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు (Namrata Mahesh) భార్య నమ్రతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు అభిమానులతో అప్డేట్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది నమ్రత. ఇప్పుడు కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది.

ఇంకా చదవండి ...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు భార్య నమ్రతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు అభిమానులతో అప్డేట్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది నమ్రత. ఇప్పుడు కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది మహేష్ బాబు సతీమణి. తాజాగా నమ్రత చేసిన ఈ ఎమోషనల్ పోస్టు వైరల్ అవుతుంది. ఈమె తండ్రి 16 ఏళ్ల కింద మరణించారు. దాంతో తండ్రిని తలచుకొని బాధ పడుతుంది నమ్రత. 16 ఏళ్లుగా ప్రతి రోజూ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నాను నాన్న అంటూ పోస్ట్ చేసింది. మీరు ఎక్కడ ఉన్నా కచ్చితంగా నన్ను చూసి గర్వంగా ఉంటారని అనుకుంటున్నాను.. మీరే నా వెనకుండి ధైర్యాన్ని ఇచ్చారు.. అదే తండ్రి ప్రేమ అంటూ ఎమోషనల్ అయ్యింది నమ్రత.

అంతేకాదు తన హృదయంలో తండ్రి ప్రేమ ఎప్పటికీ ఒకేలా ఉంటుందని.. ఆయన స్థానం ఎప్పుడూ అలాగే ఉంటుందని చెప్పింది. తండ్రి జయంతి సందర్భంగా అంటూ నమ్రత చేసిన పోస్టు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. నమ్రతకు చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రి అంటే ఎంతో ప్రేమ. తను చేసే ప్రతి విషయంలో నాన్న సపోర్ట్ ఉండేది అంటూ.. ఇది వరకు కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది నమ్రతా మహేష్. తన జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి నాన్న ఎంతో గౌరవం ఇచ్చారని.. తాను కూడా ఆయన ఇచ్చిన ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నానని చెప్పింది.

ప్రతియేటా తన తండ్రి జయంతి రోజు ఆయన జ్ఞాపకార్థం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంటుంది. ఈసారి కూడా అలాగే చేస్తుంది నమ్రత. ప్రస్తుతం ఈమె చేసిన ఎమోషనల్ పోస్ట్ చూసిన తర్వాత మహేష్ బాబు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా నమ్రతను ఓదారుస్తున్నారు. మీలాంటి కూతురు ఉన్నందుకు మీ తండ్రి నిజంగా గర్వపడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబును పెళ్లి చేసుకోక ముందు మోడలింగ్ తో పాటు కొన్ని సినిమాలు కూడా చేసింది నమ్రత. అయితే పెళ్లి తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయింది. మహేష్ బాబు కెరీర్ తో పాటు ప్రతి ఒక్క విషయంలో నమ్రత అన్ని ముందుండి చూసుకుంటున్నారు.

First published:

Tags: Namrata Shirodkar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు