సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత తన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నమ్రతకు తన భర్తైన మహేష్ బాబు, కొడుకు గౌతమ్ కృష్ణ, మామగారైన సూపర్ స్టార్ కృష్ణగారే బలమన్నారు. అంతేకాదు ఈ ముగ్గురుకి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ముగ్గురే నా జీవితంలో హీరోలు. ఈ ముగ్గురితో నా లైఫ్.. పరిపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ.. గౌరవం మరిచిపోలేనిదన్నారు. ప్రతి సారీ ఈ ముగ్గురు నాకు ఓ కొత్త విషయాన్ని నేర్పిస్తునందకు ఆనందంగా ఉందన్నారు. వీళ్లే.. నా బలం.. బలహీనత.. నా జీవితం అంటూ నమ్రత కాస్త ఎమోషనల్ అయింది.
తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ‘సరిలేరే నీకెవ్వరు’. ఈ సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంతో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gautham Krishna, Krishna, Mahesh babu, Namratha Shirodkar, Rashmika mandanna, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood