టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత.. తన ఇద్దరు పిల్లలతో విదేశాల్లో సైక్లింగ్ చేస్తున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటిది విదేశాల్లో నమ్రత.. తన ఇద్దరు పిల్లలతో సైక్లింగ్ చేస్తోన్న వీడియో ఎక్కడిదా అని ఆశ్యర్యపోకండి. ఎపుడో విదేశాలకు వెళినపుడు తీసిన వీడియోను తాజాగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. జర్మనీలో బ్రెన్నర్స్‌లో కొడుకు గౌతమ్ కృష్ణతో సరదాగా సైక్లింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. వీళ్లిద్దరితో పోటీ పడలేక సితార వెనకాలే వాళ్లను చూస్తూ ఉండిపోయింది. వచ్చేసారైనా సైకిల్‌ను స్పీడ్‌గా తొక్కాలంటూ సితారకు నమ్రత సూచనలు సలహాలు ఇచ్చింది. ప్రస్తుతం నమ్రత.. తన భర్త పిల్లతో కలిసి ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె దగ్గరుండి చూసుకుంటోంది. తాజాగా మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gautham Krishna, Mahesh babu, Mahesh Babu Daughter Sitara, Namratha Shirodkar, Telugu Cinema, Tollywood