హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu : హోం థియేటర్‌లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ వీక్షించిన మహేష్ బాబు..

Mahesh Babu : హోం థియేటర్‌లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ వీక్షించిన మహేష్ బాబు..

‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ వీక్షించిన మహేష్ బాబు (Twitter/Photo)

‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ వీక్షించిన మహేష్ బాబు (Twitter/Photo)

Mahesh Babu : హోం థియేటర్‌లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ వీక్షించిన మహేష్ బాబు.. ఈ విషయాన్ని ఈ సినిమా హీరో సుధీర్ బాబు అభిమానులతో పంచుకున్నారు.

Mahesh Babu : ఈ శుక్రవారం థియేటర్స్‌లో సందడి చేసిన సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటిల్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు (super Star Mahesh Babu).. తన ఓన్ హోమ్ థియేటర్‌లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ (Sridevi Soda Centre)ను వీక్షించారు. ఈ విషయాన్ని మహేష్ బాబు బావ శ్రీదేవి సోడా సెంటర్ హీరో సుధీర్ బాబు.. తన సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్‌ఫామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. మహేష్  తన ఇంట్లో ఉన్న హోం థియేటర్‌(Home Theatre)లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ మూవీని వీక్షించారు. అంతేకాదు మహేష్ బాబు ‘శ్రీదేవి  సోడా సెంటర్’ మూవీ బాగుందని.. సుధీర్ బాబు. ఆనందితో పాటు సీనియర్ నరేష్ మరోసారి తమ నటనతో ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చారని చెప్పుకొచ్చారు.

అంతేకాదు 1978 పలాస తర్వాత దర్శకుడు కరుణ కుమార్ మంచి ఇంటెన్సివ్ ప్రేమకథను తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా సుధీర్ బాబు గ్రామీణ యువకుడిగా అతని నటన ఆకట్టుకుందని మహేష్ బాబు మెచ్చుకున్నారు.

దేశ  వ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ ఫాన్సీ ప్రైస్ కు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను భారీగా రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..

ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లోనూ ‘శ్రీదేవి సోడా సెంటర్’మూవీకి  అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. మొత్తంగా సుధీర్ బాబు సినిమాకు చాలా కాలం తర్వాత మంచి టాక్ సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Sridevi Soda Center, Sudheer Babu, Tollywood

ఉత్తమ కథలు