Home /News /movies /

MAHESH BABU WANTS TO FOLLOW HIS WIFE NAMRATA SHIRODKAR ON SOCIAL MEDIA SB

Mahesh Babu: మహేష్ బాబు ఎవర్నీ ఫాలో అవుతాడో తెలుసా? షాకింగ్ సమాధానం

నమత్రను ఫాలో అవుతానన్న మహేష్ బాబు

నమత్రను ఫాలో అవుతానన్న మహేష్ బాబు

సర్కారు వారి పాట ప్రమోషన్లలో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు.మహేష్ బాబు ట్విట్టర్‌లో ఓ వీడియోను వదిలారు. అందులో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

    మహేష్ బాబు..  తన రాబోయే చిత్రం 'సర్కారు వారి పాట' ప్రమోషన్‌లో బిజీగా మారాడు. ఎక్కడిక్కడే ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా వైరల్ ట్విట్టర్ #Whatshappening ట్రెండ్‌లో పాల్గొన్నారు. అతను ప్లాట్‌ఫారమ్‌లో ఎవరిని అనుసరించాలనుకుంటున్నాడనే దానితో సహా కొన్ని తేలికపాటి ట్విట్టర్ ప్రశ్నలకు చకచక సమాధానాలు ఇస్తూ పోయాడు.

    మహేష్ బాబు ట్విట్టర్‌లో ఓ వీడియోను వదిలారు. అందులో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీ గురించి మీరు ఒక్క మాట, హ్యాష్ ట్యాగ్‌లో వివరించండి అని ఓ నెటిజన్ అడిగితే.. కామ్ అండ్ ఫోకస్ అని సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. మీ డీఎంలో వచ్చిన ఫన్నీయెస్ట్ మెసెజ్ ఏది అని ఇంకో నెటిజన్ అడిగాడు. అసలు నా డీఎం అనేది లాక్ చేసి ఉంచాను.. అది ఓపెన్ చేయాలా? అని మహేష్ చెప్పుకొచ్చారు.

    ఓ ఎమోజీలో మిమ్మల్ని మీరు వివరించండి అని మరో నెటిజన్ అడిగాడు. దీనికి స్మైలీ ఎమోజీ అని నవ్వుతూ చెప్పారు. మీరు ట్విట్టర్‌లో ఎవరినైనా ఒకరిని ఫాలో అవ్వాలనుకుంటే అది ఎవరిని? అని అడిగాడు ఇంకో నెటిజన్. నమ్రత ట్విట్టర్‌లో ఉంటే బాగుండేది.. ఆమెను ఫాలో అయ్యేవాడిని అంటూ చిలిపిగా సమాధానం చెప్పేశారు.ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ ఉండాలా అంటారా ? ఎస్ ఆర్ నో అన్న ప్రశ్నకు ఏ బిగ్ యస్ అంటూ మహేష్ రిప్లై ఇచ్చారు.


    ఒక్కడు సినిమాలోని ఏ కారెక్టర్‌ను ఫాలో అవుతారు.. మ్యూట్ చేస్తారు.. బ్లాక్ చేస్తారు అని ప్రశ్నించారు ఓ నెటిజన్. స్వప్న పాత్రను ఫాలో అవుతాను.. ముకేష్ రిషి నా తండ్రి పాత్రను మ్యూట్ చేస్తాను.. ప్రకాష్ రాజ్ ఓబుల్ రెడ్డి పాత్రను బ్లాక్ చేస్తాను అని మహేష్ బాబు సమధానం ఇచ్చారు.ఇక సర్కారు వారి పాట కోసం చెప్పండి అంటూ అడగ్గా.. ‘నా అభిమానులు ఈ వేసవిలో బ్లాస్ట్ సినిమా చూస్తారా’ అంటూ చెప్పాడు.

    మరోవైపు  సర్కారు వారి పాట సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి.   సర్కారు వారి పాట చిత్రంపై  అభిమానులు  భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో బాబు బాక్సాఫీస్‌ను దడదడలాడించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇటు మహేష్ కూడా మాట్లాడుతూ.. సినిమాలో మొదటి 45 నిమిషాలు.. థియేటర్ ఊగిపోవడం ఖాయమని.. అన్నాడు. దీంతో సర్కారు వారి పాట ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mahesh Babu, Namrata, Namrata Shirodkar, Sarkaru Vaari Paata

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు