అల్లు అర్జున్, మహేష్ బాబు వార్ స్టిల్ కంటిన్యూస్..

Mahesh vs Allu Arjun: ఎందుకో తెలియదు కానీ సంక్రాంతి నుంచి మహేష్, బన్నీ మధ్య చాలా పెద్ద సమరమే జరుగుతుంది. థియేటర్స్ నుంచి కలెక్షన్స్ వరకు అన్నింట్లోనూ పోటీ పడుతూ వస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 3, 2020, 8:13 PM IST
అల్లు అర్జున్, మహేష్ బాబు వార్ స్టిల్ కంటిన్యూస్..
మహేష్ బాబు, అల్లు అర్జున్ (mahesh babu vs allu arjun)
  • Share this:
ఎందుకో తెలియదు కానీ సంక్రాంతి నుంచి మహేష్, బన్నీ మధ్య చాలా పెద్ద సమరమే జరుగుతుంది. థియేటర్స్ నుంచి కలెక్షన్స్ వరకు అన్నింట్లోనూ పోటీ పడుతూ వస్తున్నారు. చివరికి డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై కూడా ఒకరికొకరు పోటీ పడ్డారు. మహేష్ బాబు ఏది చేస్తే బన్నీ అది చేస్తున్నాడు.. ఇక అల్లు అర్జున్ ఏం చేస్తే సూపర్ స్టార్ కూడా అదే చేస్తానంటున్నాడు. ఇదంతా సంక్రాంతి నుంచే మొదలైంది. జనవరి 12న అల వైకుంఠపురములో సినిమాతో పాటు సరిలేరు నీకెవ్వరు కూడా విడుదల చేయాలనుకున్నాడు మహేష్ బాబు.
మహేష్ బాబు, అల్లు అర్జున్ (mahesh babu vs allu arjun)
మహేష్ బాబు, అల్లు అర్జున్ (mahesh babu vs allu arjun)


ఇద్దరు స్టార్స్ ఒక్కరోజు ఎందుకని కూర్చుని మాట్లాడుకుంటే.. ఒక్కరోజు వెనక్కి తగ్గి జనవరి 11న వచ్చి సంచలన విజయం అందుకున్నాడు మహేష్. అయితే మహేష్ కంటే పెద్ద విజయం అల వైకుంఠపురములో సినిమాతో ఒకరోజు తర్వాత వచ్చి అందుకున్నాడు బన్నీ. అలా మహేష్‌పై పై చేయి సాధించాడు అల్లు వారబ్బాయి. అయితే ఆ తర్వాత కలెక్షన్ల విషయంలో ఇద్దరూ పోటీ పడ్డారు. ఈయన హిట్ అంటే ఆయన సూపర్ హిట్ అన్నాడు.. ఈయన ఇండస్ట్రీ హిట్ అయితే ఆయన ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ అన్నాడు. మొత్తానికి అది అలా అయిపోయిందనుకుంటే.. వీడియో సాంగ్స్ విషయంలో కూడా పోటీ పడ్డారు.
మహేష్ బాబు, అల్లు అర్జున్ (mahesh babu vs allu arjun)
మహేష్ బాబు, అల్లు అర్జున్ (mahesh babu vs allu arjun)

సరిగ్గా సరిలేరు నీకెవ్వరు విడుదల చేసిన రోజే అల వైకుంఠపురములో పాటలు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇక సన్ నెక్ట్స్‌లో అల వైకుంఠపురములో వచ్చిన రెండు రోజులకే అమెజాన్‌లో సరిలేరు నీకెవ్వరు వచ్చింది. అక్కడ కూడా ఇద్దరూ పోటీ పడ్డారు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు గత వారమే టీవీలో వచ్చి 23.4 రికార్డ్ రేటింగ్ సాధించింది. బాహుబలిని కూడా బీట్ చేసింది. ఇప్పుడు అల వైకుంఠపురములో కూడా టీవీలో ప్రసారం కాబోతుంది. త్వరలోనే దీన్ని జెమిని టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇక్కడ కూడా బన్నీ, మహేష్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరి చూడాలిక.. ఇంకా ఎన్ని రోజులు ఈ సమరం కొనసాగుతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: April 3, 2020, 8:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading