Home /News /movies /

MAHESH BABU VISITS SHIRDI TEMPLE AHEAD OF SARILERU NEEKEVVARU RELEASE SR

సినిమా రిలీజ్ ముందు షిర్డీ వెళ్ళిన మహేష్ బాబు...

Twitter

Twitter

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

    సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అవుతోంది. ఈ సినిమాలో మహేష్.. మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర చేస్తున్నాడు. లేడి సూపర్ స్టార్ విజయశాంతి చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. మహేష్ సరసన మొదటి సారి రష్మిక మందన నటిస్తోంది. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మహేష్, తన సినిమా సరిలేరు నీకెవ్వరు విడుదలకు ముందు మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని సందర్శించాడు. కుటుంబం సమేతంగా ఆయన షిర్డీ చేరుకొని సాయిబాబాకు ప్రార్థనలు చేశాడు. అయితే కుటుంబంతో ఆయన ఈనెల 27న ఎయిర్ పోర్ట్‌లో కనిపించడంతో న్యూఇయర్ సందర్భంగా వరల్డ్ టూర్ కి వెళ్లారని అందరూ భావించారు. కానీ మహేష్ సడన్‌గా షిర్డీ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. ఈ షిర్డీ క్షేత్ర సందర్శనలో మహేష్‌తో పాటు దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఉన్నాడు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Mahesh babu, Sarileru Neekevvaru

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు