MAHESH BABU VISITED DUBAI POLICE STATION DUE TO SARKARU VAARI PAATA SHOOTING GAP TA
Mahesh Babu: దుబాయ్ పోలీస్ స్టేషన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. దేని కోసమో తెలుసా..
దుబాయ్ పోలీస్ స్టేషన్లో మహేష్ బాబు (Twitter/Photo)
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో భాగంగా మహేష్ బాబు..
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్లో మహేష్ బాబు, కీర్తి సురేష్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటకే దుబాయ్‌లో మహేష్ బాబు షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు లీకైయ్యాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, కీర్తి సురేష్ లపై పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
కొద్ది రోజులుగా దుబాయ్‌లో షూటింగ్‌కు సంబంధించిన పలు ప్రాంతాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మహేష్ బాబు.. సర్కారు వారి పాట షూటింగ్లో భాగంగా దుబాయ్ పోలీస్ స్టేషన్‌ను చూపించారు. ఈ గురవారం లా మెర్ స్టేషన్ ఈ వాల్డ్‌లో ఫస్ట్ స్మార్ట్ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ మనుషులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్న విషయాన్ని మహేష్ బాబు చెప్పారు.
ఈ విషయాన్ని గల్ఫ్‌కు సంబంధించిన కొన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ఇలాంటి పోలీస్ స్టేషన్‌ను తాను గతంలో చూడలేదన్నారు. ఇక్కడకి రావడం అద్భుతమైన అనుభవం అన్నారు. కొద్ది రోజులుగా దుబాయ్‌లోని పలు ప్రాంతాలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వస్తున్న మహేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేషన్‌ను చూపించారు. ఇక్కడకి రావడం అద్భుతమైన అనుభవం అన్నారు.
సర్కారు వారి పాట: సంక్రాంతి 2022
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విషయానికొస్తే.. ఈ మూవీని పరుశురామ్ సోషల్ మెసేజ్ కథతో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫైట్స్ కోసం ఫైట్ మాస్టర్ నుంచి శిక్షణ తీసుకుంటున్నాడు. దానికి సంబంధించిన ఫోటోను నమ్రత షేర్ చేసింది.
ఇక మరోవైపు సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్ గా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్ పాత్రలో నటించడం దాదాపు ఖాయం అయింది.