మహేష్ బాబుతో విజయ శాంతి నవ్వులు... సరిలేరు మీకెవ్వరు అంటున్న నెటిజన్స్..

ఈ యేడాది ‘మహర్షి’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మహేష్ బాబు.. అదే ఊపులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్‌లో విజయ శాంతితో మహేష్ బాబుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 30, 2019, 9:05 AM IST
మహేష్ బాబుతో విజయ శాంతి నవ్వులు... సరిలేరు మీకెవ్వరు అంటున్న నెటిజన్స్..
‘సరిలేరు నీకెవ్వరు’ సెట్‌లో మహేష్,విజయశాంతి, ప్రకాష్ రాజ్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి (Twitter/Photo)
  • Share this:
ఈ యేడాది ‘మహర్షి’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మహేష్ బాబు.. అదే ఊపులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలటరీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఒకప్పటి  లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా  రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే దీపావళి సందర్భంగా విజయ్ శాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. భారతి అనే లెక్చరర్ పాత్రలో విజయ శాంతి లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు, విజయ్ శాంతితో నవ్వుతున్న ఫోటోను చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది.ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు . దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.
First published: October 30, 2019, 9:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading