Home /News /movies /

MAHESH BABU VENKATESH SPECIAL WISHES FOR JR NTR BIRTHDAY SLB

HBD Jr Ntr: నమ్మశక్యం కాని టాలెంట్ అది! మహేష్ బాబు, వెంకటేష్ సహా ప్రముఖుల రెస్పాన్స్

Photo Twitter

Photo Twitter

Ntr Birthday: నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ #NTRBirthday హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కి స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు.

ఇంకా చదవండి ...
నేడు (మే 20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ #NTRBirthday హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు గత రాత్రి నుంచే సుదూర ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఎన్టీఆర్ ఇంటి ముందు గుమిగూడి రోడ్డుపైనే కేక్ కట్ చేసి హంగామా చేశారు. ఇదిలా ఉంటే ఇక ఎన్టీఆర్ తోటి హీరోలు, ఆయనతో సన్నిహితంగా ఉండే సినీ సెలబ్రిటీలు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్స్ చూసి నందమూరి అభిమాన లోకం ఖుషీ ఖుషీ అవుతోంది. మరీ ముఖ్యంగా రాజమౌళి కుమారుడు కార్తికేయ, సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ చేసిన ట్వీట్స్ చూసి యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

RRR షూటింగ్ సమయంలో కొమురం భీముడిగా ఉన్న ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఓ మెమరబుల్ పిక్ షేర్ చేసిన రాజమౌళి కుమారుడు కార్తికేయ.. ఎన్టీఆర్ టాలెంట్‌ని పొగుడుతూ ట్వీట్ పెట్టారు. నమ్మశక్యం కాని ప్రతిభకు, పవర్ హౌస్ టాలెంట్‌కి కేరాఫ్ అడ్రస్ అన్నా మీరు అంటూ ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు కార్తికేయ. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు రియాక్ట్ అవుతూ.. ''హ్యాపీ బర్త్ డే బ్రదర్, రానున్న రోజుల్లో నీవు గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా'' అని ట్వీట్ పెట్టారు. హీరోయిన్ హన్సిక, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సహా పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్‌కి బెస్ట్ విషెస్ అందించారు.










అదేవిధంగా ''చలన చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న విలక్షణమైన నటులు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు'' అంటూ తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ అజయ్ కుమార్ పువ్వాడ ట్వీట్ చేశారు.

వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా తన మార్క్ చూపెడుతున్నారు ఎన్టీఆర్. ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేసి భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఈ నందమూరి నట వారసుడు ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో రూపొందనున్నాయి.
Published by:Sunil Boddula
First published:

Tags: Daggubati venkatesh, Jr ntr, Mahesh Babu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు