AMB Victory : ముగ్గురు హీరోలు క‌లిసి హైదరాబాద్‌లో భారీ మ‌ల్టీ ప్లెక్స్ నిర్మాణం..

Mahesh Babu Venkatesh Rana Photo : Twitter

AMB Victory : మన టాలీవుడ్ స్టార్స్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా మన స్టార్స్‌కు ఇప్పటికే ఫిల్మ్ స్టూడియోస్‌తో పాటు థియేటర్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. ఇక లేటెస్ట్‌గా స్టార్ హీరోలు మల్టీ ఫ్లెక్స్‌లపై ఫోకస్ చేశారు.

 • Share this:
  మన టాలీవుడ్ స్టార్స్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా మన స్టార్స్‌కు ఇప్పటికే ఫిల్మ్ స్టూడియోస్‌తో పాటు థియేటర్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. ఇక లేటెస్ట్‌గా స్టార్ హీరోలు మల్టీ ఫ్లెక్స్‌లపై ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే మహేష్ బాబు ఏసియన్‌తో కలిసి ఏఎంబీ అంటూ ఓ సినిమా థియేటర్ ఫ్లస్ షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేసి విజయవంతంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఏఎండీ అనే మల్టీ ప్లెక్స్ ప్రారంభించారు. విజయ్ ఈ మల్టీ ఫెక్స్‌ను తన స్వస్థలం అయిన మహాబూబ్ నగర్‌లో ప్రారంభించారు. ఇక అల్లు అర్జున్ కూడా ఏఏఏ అనే మల్టీ ప్లెక్స్‌ను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఏఏఏ నిర్మాణ దశలో ఉంది. అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఏషియన్ సినిమాస్‌తో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. అమీర్ పేట సత్యం థియేటర్ ప్లేస్‌లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడ మరో క్రేజీ మల్టీ ఫ్లెక్స్ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టులో ఒకరు కాదు..ఇద్దరు కాదు..ముగ్గురు హీరోలు పాలు పంచుకోవడం విశేషం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

  ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, వెంకటేష్‌, రానాతో కలిసి ఏఎమ్ బి విక్టరీ పేరుతో భారీ స్థాయిలో ఒక మల్టీప్లెక్స్‌ని స్టార్ చేయబోతున్నారని వినిపిస్తోంది. ఇటు మాల్ గా, అటు మల్టీ ఫ్లెక్స్ గా దీన్ని రూపోందిస్తున్నారట. అంతేకాదు హైదరాబాద్‌లో ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్‌ను మించి ఈ నిర్మాణం ఉండబోతుందని, సకల సదుపాయాలతో ఓ రేంజ్‌లో దీన్ని రూపోందించనున్నారని టాక్.

  Kajal Aggarwal : కాజల్ గర్భవతి అయ్యిందా.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

  హైదరాబాద్‌కే ఒక ఐకాన్ బిల్డింగ్‌గా దీన్ని నిర్మిస్తున్నారట. ఇప్పటికే ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్. ఈ థియేటర్ కమ్ షాపింగ్ మాల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్సన్ థియేటర్ స్థలంలో రూపు దిద్దుకోబోతున్నట్టు సమాచారం. దీనికి గురించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

  ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తమిళంలో పలు సినిమాల్లో హీరోగా కూడా చేసి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తోంది.

  Ram Pothineni : రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్ పోతినేని లింగుసామి చిత్రం..

  ఇక ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.

  ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.

  Maha Samudram 1st Weekend Collections: ‘మహా సముద్రం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. మహా డిజాస్టర్ బాబోయ్..

  సర్కారు వారి పాట ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది. దీంతో ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్  (Vidya Balan)నటించనుందని సమాచారం. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.

  ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.

  ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
  Published by:Suresh Rachamalla
  First published: