హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu Maharshi: ‘మహర్షి’ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్..

Mahesh Babu Maharshi: ‘మహర్షి’ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్..

6. మహర్షి: మహేష్ బాబు నటించిన మరో సినిమా మహర్షి కూడా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు తీసుకొచ్చింది. ఇది 8.44 కోట్ల షేర్ వసూలు చేసింది.

6. మహర్షి: మహేష్ బాబు నటించిన మరో సినిమా మహర్షి కూడా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు తీసుకొచ్చింది. ఇది 8.44 కోట్ల షేర్ వసూలు చేసింది.

Mahesh Babu Maharshi: కొన్ని సినిమాలు చేస్తున్నపుడు అవి అవార్డు విన్నింగ్ సినిమాలు అని ఊహించలేం. కానీ తీరా వచ్చిన తర్వాత నోరెళ్లబెట్టుకుని చూస్తుంటాం. ఇప్పుడు మహేష్ బాబు మహర్షి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.

కొన్ని సినిమాలు చేస్తున్నపుడు అవి అవార్డు విన్నింగ్ సినిమాలు అని ఊహించలేం. కానీ తీరా వచ్చిన తర్వాత నోరెళ్లబెట్టుకుని చూస్తుంటాం. ఇప్పుడు మహేష్ బాబు మహర్షి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా చేస్తున్నపుడు తన కెరీర్‌లో మరిచిపోలేని సినిమా ఇది అవుతుందంటూ చాలాసార్లు చెప్పాడు సూపర్ స్టార్. అలా ఎందుకన్నాడో ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకు ఇప్పుడు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. కెరీర్‌లో ఎప్పుడూ లేనట్లు ఆ సినిమా సమయంలోనే కాలర్ ఎగరేసుకున్నాడు మహేష్ బాబు. ఇప్పుడు ఆయన అభిమానులను మరోసారి కాలర్ ఎగరేసేలా చేస్తున్నాడు మహర్షి. ఊపిరి తర్వాత ఈ సినిమా కథ రాసుకుని మహేష్ బాబు కోసం రెండేళ్లు వేచి చూసాడు. అక్కడే సూపర్ స్టార్ పడిపోయాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ మహర్షి సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తాజాగా ప్రకటించిన 67 వ జాతీయ అవార్డుల్లో 3 నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు భాష నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది మహర్షి. అలాగే ఈ సినిమాను నిర్మాణ సంస్థలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌజ్‌ను ఉత్తమ నిర్మాణ సంస్థగా నేషనల్ అవార్డు వరించింది. మహర్షి సినిమాను PVPతో కలిసి దిల్ రాజు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు.

mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu maharshi movie,mahesh babu maharshi movie 3 national awards,mahesh babu maharshi movie national awards,mahesh babu maharshi movie best entertainer,mahesh babu maharshi movie best choreography raju sundaram,మహర్షి సినిమాకు మూడు నేషనల్ అవార్డులు,మహేష్ బాబు మహర్షి ఉత్తమ వినోదాత్మక చిత్రం
మహేష్ బాబు మహర్షి (Maharshi)

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేసిన రాజు సుందరం బెస్ట్ డాన్స్ మాస్టర్‌గా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఒకేసారి మూడు అవార్డులు రావడంతో మహర్షి సినిమా యూనిట్ కూడా ఇప్పుడు సంతోషంలో మునిగిపోయారు. వ్యవసాయం, రైతుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2019 లో హైయెస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్.. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించారు.

First published:

Tags: Mahesh Babu, National Awards, Telugu Cinema, Tollywood, Vamsi paidipally

ఉత్తమ కథలు