• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MAHESH BABU VAMSI PAIDIPALLY MAHARSHI GETS 9TH TIME SOLID TRP RATING AGAIN HERE ARE THE DETAILS SR

Mahesh Babu : తొమ్మిదో సారి కూడా దుమ్ములేపిన మహర్షి.. రికార్డ్ టీర్ఆర్‌‌పీ రేటింగ్..

Mahesh Babu : తొమ్మిదో సారి కూడా దుమ్ములేపిన మహర్షి.. రికార్డ్ టీర్ఆర్‌‌పీ రేటింగ్..

Mahesh Babu Photo :Twitter

Mahesh Babu : ఓ వైపు మహేష్ సినిమాలు థియేటర్స్‌ మంచి వసూళ్లను రాబడుతుంటే మరోవైపు ఇటు చిన్న తెరపై కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.

  • Share this:
    సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను ముగించుకుని రెండవ షెడ్యూల్‌ను ఇటీవలే స్టార్ట్ చేసింది. వచ్చే సంక్రాంతి విడుదలకానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్‌లో చిత్ర షూటింగ్ దుబాయ్ లో చేశారు. అక్కడి ఎడారిలో ఫైట్ సీక్వెన్స్ చేశారు. బ్యాంక్ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. దుబాయ్ షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. అది అలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు.. గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఓ వైపు మహేష్ సినిమాలు థియేటర్స్‌ మంచి వసూళ్లను రాబడుతుంటే మరోవైపు ఇటు చిన్న తెరపై కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో  వచ్చిన మహర్షి ఇటీవల జెమినీ టీవీలో తొమ్మిదో సారి ప్రసారం అయ్యి మరోసారి మంచి రేటింగ్స్‌ను దక్కించుకుంది.

    సందేశాత్మక సినిమాగా రూపొందిన ఈ సినిమా అటు థియేటర్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇటు ఈ సినిమా చిన్న తెర మీద ఎన్ని సార్లు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు రికార్డు స్థాయి టిఆర్పీ సాధిస్తోంది. తాజాగా తొమ్మిదో సారి టెలికాస్ట్ అయిన మహర్షి 4.92 టిఆర్పీని తెచ్చుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ సినిమా తొమ్మిది సార్లు ప్రసారం అయ్యి కూడా ఇంత రేటింగ్‌ను తెచ్చుకుందంటే మామూలు విషయం కాదు అంటున్నారు విశ్లేషకులు. ఇక ఆయన సరిలేరు నీకెవ్వరు సినిమా టెలివిజన్ లో ప్రసారం అయ్యి రికార్డు స్థాయిలో 29.4 రేటింగ్ సాధించింది.


    ఇక మహేష్ నటిస్తున్న ప్రస్తుత సినిమా సర్కారు వారి పాట విషయానికి వస్తే.. ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాలను చర్చించనుందట. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి హీరో ఎలా రాబట్టాడు అనేది కథాంశంగా తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందట. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడు. ఈ సినిమాలో మహేష్ ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. ఆ పాత్రలో మలయాళ సీనియర్ హీరో జయ్ రామ్‌ను తీసుకోనుందని తెలుస్తోంది. జయరామ్ ఆ మధ్య అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములోలో నటించిన సంగతి తెలిసిందే.

    ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు టాక్. సర్కారు వారి పాటను మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: