• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MAHESH BABU VAMSI PAIDIPALLY MAHARSHI GETS 10 TIME SOLID TRP RATING HERE ARE THE DETAILS SR

Mahesh Babu : మహేష్ బాబు సినిమాకు పదోసారి కూడా సాలిడ్ టీఆర్‌పీ రేటింగ్స్..

Mahesh Babu Photo : Twitter

Mahesh Babu : మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ వచ్చిన చిత్రం మహర్షి. మహేష్ బాబు 25వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఇటీవల పదోసారి కూడా అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్స్‌ను దక్కించుకుంది.

  • Share this:
    సూపర్ స్టార్ మహేష్ రైతు పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా మహర్షి. మహేష్ నటించిన 25 వ చిత్రం కావడంతో సినిమా పై మంచి అంచనాలున్నాయి. దానికి ఏమాత్రం తగ్గకుండా వంశీ చక్కగా తీర్చిదిద్దారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2019 లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా ఇటీవల పదోసారి జెమినీ టీవీలో ప్రసారం అయ్యి సాలిడ్ టీఆర్పీని దక్కించుకుంది. పదోసారి ప్రసారం అయ్యి 7.82 రేటింగ్స్‌తో అదరగొట్టింది. ఒక సినిమా పదోసారి కూడా టీవీలో ప్రసారం అయ్యి ఈ రేంజ్‌లో టీఆర్పీను తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదంటున్నారు. ఇక మహర్షి సాధించిన ఈ రేర్ ఫీట్‌ను సెలెబ్రేట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక మహేష్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. మహేష్ సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను ముగించుకుని రెండవ షెడ్యూల్‌ స్టార్ట్ చేయ్యగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా జూలై తిరిగి షూటింగ్‌ను పున: ప్రారంభించనుంది.

    ఈ సినిమాలో భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాలను చర్చించనున్నారట. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి హీరో ఎలా రాబట్టాడు అనేది కథాంశంగా తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం. అంతేకాదు పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నారట. ఈ సినిమాలో మహేష్ ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. ఆ పాత్రలో మలయాళ సీనియర్ హీరో జయ్ రామ్‌ను తీసుకోనుందని తెలుస్తోంది. జయరామ్ ఆ మధ్య అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములోలో నటించిన సంగతి తెలిసిందే.


    మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు టాక్. సర్కారు వారి పాటను మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మరోసారి నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published: