మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాపై కొత్త ట్విస్ట్..

Mahesh babu Vamshi Paidipally |ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు మహేష్ బాబు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో నెక్ట్స్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్‌ను మహేష్ బాబు హోల్ట్‌లో పెట్టాడు. అందతకు ముందు మహేష్.. ఇలానే సుకుమార్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి చివరి నిమిషంలో రద్దు చేసుుకున్న సంగతి తెలిసిందే కదా.తాజాగా ఈ ప్రాజెక్ట్ పై కొత్త అప్‌డేట్ వచ్చింది.

news18-telugu
Updated: May 1, 2020, 9:17 AM IST
మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాపై కొత్త ట్విస్ట్..
దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ బాబు (Mahesh Babu Vamshi Paidipally)
  • Share this:
ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు మహేష్ బాబు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో నెక్ట్స్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్‌ను మహేష్ బాబు హోల్ట్‌లో పెట్టాడు. అందతకు ముందు మహేష్.. ఇలానే సుకుమార్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి చివరి నిమిషంలో రద్దు చేసుుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక మహేష్ బాబుతో చేద్దామనుకున్న స్టోరీని ఇపుడు అల్లు అర్జున్‌తో చేస్తున్నాడు సుకుమార్. అంతకు ముందు మహేష్ బాబు పూరీ జగన్నాథ్‌తో చేద్దామనుకున్న ‘జనగణమన’ సినిమాను చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. తాజాగా మహేష్ బాబు, వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పై కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. అదేమిటంటే.. మహేష్, వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ఆగిపోలేదట. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటంటే అందులో మహేష్ బాబు హీరో కాదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Mahesh babu Vamshi paipally movie new update,Mahesh Babu,vamshi paidipally,mahesh babu vamshi paidipally project,mahesh babu vamshi paidipally ram charan,mahesh babu Twitter,mahesh babu instagram,ram charan twitter,ram charan instagram,mahesh babu to work with Geetha Govindam director,mahesh babu,mahesh babu twitter,vamshi paidipally,vamshi paidipally twitter,mahesh babu vamshi paidipally movie,mahesh babu vamshi paidipally movie on hold,mahesh babu vamshi paidipally movie stopped,mahesh babu vamshi paidipally new movie,mahesh 27 vamshi paidipally,telugu cinema,మహేష్ బాబు,వంశీ పైడిపల్లి,వంశీ పైడిపల్లి మహేష్ బాబు సినిమా,గీత గోవిందం,పరుశురామ్,మహేష్ బాబు వంశీ పైడిపల్లి,వంశీ పైడిపల్లి రామ్ చరణ్ మహేష్ బాబు,రామ్ చరణ్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి
మహేష్ బాబు, వంశీ పైడిపల్లి,రామ్ చరణ్ (Twitter/Photo)


వంశీ పైడిపల్లి రెడీ చేసిన స్టోరీ మహేష్ బాబు ఇమేజ్‌కు సరిపడేలా లేదనే టాక్ వినబడుతోంది. అందుకే మహేష్ బాబు ఈ స్టోరీని మీరు వేరే హీరోతో చేయండి. కావాలంటే నేను ప్రొడ్యూస్ చేస్తానని వంశీకి చెప్పాడట. అంతేకాదు ఈ కథకి రామ చరణ్ అయితే పర్ఫెక్‌గా ఉంటుందిని చెప్పుకొచ్చాడట. అన్నీ కుదిరితే.. వంశీ పైడిపల్లి, మహేష్ బాబు, రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. త్వరలో  ఈప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం  ఉంది. ఇక మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ నెల 31న సూపర్ స్టార్  కృష్ణ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇక వంశీ పైడిపల్లి గతంలో రామ్ చరణ్‌తో ‘ఎవడు’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా.
First published: May 1, 2020, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading