టైటిల్ లీక్‌పై మహేష్ బాబు సీరియస్.. బాధ్యత ఉండక్కర్లా..?

Mahesh Babu 27: ఈ రోజుల్లో ఏ విషయాన్ని కూడా బయటికి రాకుండా ఆపడం చాలా కష్టం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అంజలికి తెలిసిపోయినట్లే ఏమో అన్నీ అలా తెలిసిపోతాయంతే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 29, 2020, 2:43 PM IST
టైటిల్ లీక్‌పై మహేష్ బాబు సీరియస్.. బాధ్యత ఉండక్కర్లా..?
మహేష్ బాబు (Twitter/Mahesh Babu)
  • Share this:
ఈ రోజుల్లో ఏ విషయాన్ని కూడా బయటికి రాకుండా ఆపడం చాలా కష్టం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అంజలికి తెలిసిపోయినట్లే ఏమో అన్నీ అలా తెలిసిపోతాయంతే. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న క్రమంలోనే ఇదిగో ఇదే సినిమా టైటిల్ అంటూ లీక్ అయిపోయింది. టైటిల్ చెప్పడానికి వారం రోజుల ముందుగానే సర్కార్ వారి పాట అంటూ బయటికి వచ్చింది. మే 31న తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు కానుకగా టైటిల్ లోగో విడుదల చేయాలని మహేష్ బాబు భావిస్తున్న తరుణంలో ఇలా టైటిల్ బయటికి రావడంపై ఆయన చాలా అసహనానికి లోనైనట్లు తెలుస్తుంది.
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)


ఇదే విషయంపై ఆయన ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతుంది. అసలు ఎలా ఈ టైటిల్ లీక్ అయింది.. ఎవర్నుంచి బయటికి వచ్చింది అంటూ పిఆర్ టీంపై కూడా చిందులు తొక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాధ్యత ఉండక్కర్లా అంటూ సీరియస్‌గా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై దర్శకుడు పరశురామ్ కూడా అసహనానికి లోనయ్యాడు. అధికారికంగా రిలీజ్ చేద్దామనుకుంటే ఇలా లీక్ అయిపోయిందేంటి అంటూ ఆయన కూడా నిరాశలో మునిగిపోయాడు. ఇకపై ఇలాంటి సీన్ రిపీట్ అయితే బాగోదని మహేష్ బాబు కూడా తన టీంకు సీరియస్‌గానే చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయిప్పుడు.
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)

టైటిల్ లీక్ అయింది ఓకే.. కనీసం పోస్టర్ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఇకపై ఇలాంటివి వస్తే సహించేది లేదని మహేష్ కాస్త గట్టిగానే చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు కథ కూడా లీక్ అవ్వడం సూపర్ స్టార్‌ను మరింత కంగారు పెడుతున్న అంశం. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న భారీ మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ పరశురామ్ రాసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. ఏం జరగబోతుందో..?
First published: May 29, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading