Megastar Chiranjeevi Bhola Shankar: మెగా అభిమానులకు చిరు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. 'భోళా శంకర్'గా మెగాస్టార్ రచ్చ షురూ!

Megastar Chiranjeevi Bhola Shankar

Megastar Chiranjeevi Bhola Shankar: నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆరు పదుల వయసులోను వరుస సినిమాలతో తన అభిమానులను అలరిస్తున్నాడు.

 • Share this:
  Megastar Chiranjeevi Bhola Shankar: నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆరు పదుల వయసులోను వరుస సినిమాలతో తన అభిమానులను అలరిస్తున్నాడు. యువ హీరోల తరహాలోనే డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు చిరు. తన అభిమానులకు నచ్చే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశాత్మక అంశాలు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చిరంజీవి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వేదాళం రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ''బోళా శంకర్‌'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతుండగా ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

  https://twitter.com/urstrulyMahesh/status/1429284693959057417?s=19

  ఇక ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించాడు. తమిళ్ వెర్షన్ లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ వేదాళం సినిమాను రీమేక్ గా ముందుగా పవన్ కళ్యాణ్ చెయ్యాల్సి ఉండగా చివరికి చిరంజీవి సెట్ అయ్యాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయనున్న భోళా శంకర్ సినిమాలో విభిన్నమైన సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి గుండుతో కనిపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నయనతార, త్రిషను పరిశీలించిగా కీర్తి సురేష్ చెల్లి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్.
  Published by:Navya Reddy
  First published: