బండ్ల గణేష్.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నటుడిగా వచ్చి.. కమెడియన్‌గా మారి.. నిర్మాతగా ఎదిగి చాలానే చేసాడు ఈయన. ఎప్పటికప్పుడు వినోదం సృష్టిస్తూనే.. మరోవైపు వివాదాస్పదంగా కూడా ఉంటాడు. ఈయన మిస్టీరియస్ పర్సన్.. అజ్ఞాతవాసిలో పవన్ కల్యాణ్ గురించి చెప్పినట్లు ఈయన చర్యలు కూడా ఊహకందవు. ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. నటుడిగా బిజీగా ఉన్న బండ్ల ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా రాజీ లేని మాటలతో రెచ్చిపోయాడు.
సెవెన్ ఓ క్లాస్ బ్లేడ్ అంటూ ఈయన చేసిన రచ్చ ఇప్పటికీ మరిచిపోలేం. ఇక ఇప్పుడు ఇదే బ్లేడ్ కామెడీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో పండించబోతున్నాడు ఈ నటుడు. చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు బండ్ల. దాదాపు 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో దొంగ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో మహేష్ బాబుతో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయని ధీమాగా చెబుతున్నాడు అనిల్.
ముఖ్యంగా తొలిరోజు ఈయన సెట్స్‌కు వచ్చినపుడు మహేష్ బాబు చాలా ఆడుకున్నాడని.. ఆయన డైలాగ్ చెబుతుంటేనే పక్కున నవ్వేసే వాడని గుర్తు చేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్ డిస్టర్బ్ చేస్తుంటే బండ్ల గణేష్ మొహం ఇలా అయిపోయేదని.. ఏందన్నా నువ్వు అంటూ మహేష్‌ను బతిమాలేవాడని చెప్పుకొచ్చాడు అనిల్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కడుపులు చెక్కలు చేస్తాయని చెప్పాడు అనిల్. కచ్చితంగా ఈ చిత్రం తర్వాత మళ్లీ బండ్ల బిజీ అవుతాడని చెబుతున్నాడు. మొత్తానికి మహేష్ చుక్కలు చూపించినా కూడా రెండు మూడు రోజుల తర్వాత సెట్ అయిపోయాడని.. అప్పట్నుంచి ఆయన కామెడీ గాడిలో పడిందని చెప్పాడు ఈయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Mahesh babu, Telugu Cinema, Tollywood