‘సైరా’ ట్రైలర్‌కు మహేష్ బాబు ఫిదా.. అద్భుతం అంటూ ట్వీట్..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తుంది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుంది ఈ చిత్ర ట్రైలర్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 10:39 PM IST
‘సైరా’ ట్రైలర్‌కు మహేష్ బాబు ఫిదా.. అద్భుతం అంటూ ట్వీట్..
మహేష్ బాబు చిరంజీవి (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 10:39 PM IST
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తుంది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుంది ఈ చిత్ర ట్రైలర్. సెలెబ్రిటీస్ కూడా సైరా ట్రైలర్ చూసి ఫిదా అయిపోతున్నారు. బాలీవుడ్ టూ టాలీవుడ్ వరకు అంతా చిరంజీవి నటన చూసి పడిపోతున్నారు. ఈ వయసులో ఆయన పడిన కష్టానికి అంతా చేతులెత్తి దండం పెడుతున్నారు. సైరా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 34 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదు. విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి.

ఇకిప్పుడు ఈ ట్రైలర్ చూసి మహేష్ బాబు కూడా స్పందించాడు. ట్రైలర్ విజువల్ వండర్‌గా ఉందని చెప్పిన మహేష్.. ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. చిరంజీవి నటన అద్భుతంగా ఉందని చెప్పిన సూపర్ స్టార్.. అమితాబ్, చరణ్, సురేందర్ రెడ్డి, రత్నవేలుతో పాటు యూనిట్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనంగా మారుతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అక్టోబర్ 2న సైరా నరసింహా రెడ్డి విడుదల కానుంది.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...