• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MAHESH BABU TWEET ON JR NTR CORONA POSITIVE AND HE TWEET GET WELL SOON BROTHER TA

Mahesh Babu - Jr NTR: ఎన్టీఆర్‌కు మహేష్ బాబుకు భరోసా.. త్వరగా కోలుకో బ్రదర్ అంటూ ట్వీట్..

ఎన్టీఆర్‌కు మహేష్ బాబు భరోసా (Twitter/Photo)

Mahesh Babu - Jr NTR | ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా తారక్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

  • Share this:
    Mahesh Babu - Jr NTR | ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఉదృతంగా ఉందనేది కూడా గుర్తు చేయనక్కర్లేదు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ కూడా కరోనాతోనే మరణించారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి చాలా మంది హీరోలకు కరోనా వచ్చి పోయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ మహమ్మారి వెంటాడింది. ఈయనకు కూడా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని అభిమానులకు తెలియజేసారు జూనియర్ ఎన్టీఆర్. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని చెప్పారు.  అయితే ఏం సమస్య లేదని.. అంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నామని చెప్పారు.

    ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో నందమూరి అభిమానులు కలవర పాటుకు గురయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవాలని ఇండస్ట్రీలోని ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఎన్టీఆర్.. కరోనా నుంచి త్వరగా కోలుకో.. గెట్ వెల్ సూన్ బ్రదర్ అంటూ ట్వీట్  చేసారు.



    ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. మహేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఎన్టీఆర్ కూడా అభిమానులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ అభయమిచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: