Home /News /movies /

MAHESH BABU TRIVIKRAM SRINIVAS MOVIE TO START FROM APRIL HERE ARE THE DETAILS SR

Mahesh Babu | Trivikram Srinivas : మహేష్-త్రివిక్రమ్ సినిమా అప్ డేట్.. ఏప్రిల్ నుంచి షురూ...

Mahesh Trivikram Movie update Photo : Twitter

Mahesh Trivikram Movie update Photo : Twitter

Mahesh Babu | Trivikram Srinivas : సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా రాబోతోందట.

ఇంకా చదవండి ...
  Mahesh Babu | Sarkaru Vaari Paata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) ప్రస్తుతం డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.  షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రస్తుతం మేకర్స్ అక్కడ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన (Trivikram Srinivas) త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా రాబోతోందట. ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మొదలు పెట్టాలనీ చిత్రబృందం భావిస్తోందని టాక్. ఓ ఫైట్‌తో షూట్ స్టార్ట్ చేస్తారట టీమ్. ఈ ఫైట్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఓ రేంజ్‌లో కంపోజ్ చేయనున్నారట. మహేష్ - త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్ గతంలో ఖలేజా వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక పదకొండు సంవత్సరాల తరువాత (Mahesh Babu) మహేష్- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

  ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇక మరోవైపు  (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక సర్కారు వారి పాట విషయానికి వస్తే.. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు ఏకంగా 80 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకుంది.


  Rakul Preet Singh : పరవశంలో మునిగితేలుతున్న రకుల్ ప్రీత్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

  మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రాన్ని మే 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక్కడ విశేషమేమంటే.. మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.

  ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Mahesh Babu, Tollywood news, Trivikram Srinivas

  తదుపరి వార్తలు