Home /News /movies /

MAHESH BABU TRIVIKRAM SRINIVAS MOVIE STARTS FROM DASARA GOING TO SETS ON NOVEMBER LAST WEEK TA

Mahesh Babu - Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ .. సెట్స్ పైకి వెళ్లేది ఎపుడంటే..

మహేష్ బాబు,త్రివిక్రమ్ (Twitter/Photo)

మహేష్ బాబు,త్రివిక్రమ్ (Twitter/Photo)

Mahesh Babu - Trivikram :సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

    Mahesh Babu - Trivikram :సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వీళ్ల కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా.
    గత కొన్నేళ్లుగా  వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూసారు అభిమానులు. చాలా యేళ్ల తర్వాత వీళ్ల కాంబినేషన్ పట్టాలెక్కబోతుంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో అతడు సక్సెస్ సాధిస్తే.. ‘ఖలేజా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా టీవీలో మాత్రం సక్సెస్ అయింది. మధ్యలో వీళ్లిద్దరు కలిసి సినిమాలు చేయలేదు.

    కానీ మహేష్ బాబు నటించిన పలు ప్రకటనలను త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు.  ఖలేజా సినిమా సమయంలో వీళ్లిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయనే మాటలు వినిపించాయి. తాజాగా వీళ్లిద్దరు కాంప్రమైజ్ అయి మళ్లీ పని చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కబోతున్న చిత్రం దసరా కానుకగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి నవంబర్ నెలాఖారు నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

    Gopichand - Aaradugula Bullet : ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీతో గోపీచంద్ ముందున్న టార్గెట్ ఎంత..


    ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా ‘అతడు’ సినిమాకు సీక్వెల్ అనే టాక్ వినబడుతోంది. మరోవైపు ఈ సినిమాలో ఇంకో హీరోకు ఛాన్స్ ఉందట. ‘అల వైకుంఠపురుములో’ సుశాంత్ లాగా.. మహేష్, త్రివిక్రమ్ మూవీలో సుమంత్ మరో హీరోగా సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇక మహేష్ బాబు, సుమంత మంచి స్నేహితులు.

    Super Star Krishna : సూపర్ స్టార్ ఇంట్లో ఘనంగా మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలు.. హాజరైన కుటుంబ సభ్యులు..


    వీళ్లిద్దరు కూడా ఒకేసారి కెరీర్‌ స్టార్ట్ చేసారు. కానీ మహేష్ బాబు సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదిగితే.. సుమంత్ మాత్రం స్టార్ హీరో రేంజ్‌కు ఎదగలేకపోయారు. కానీ హీరోగా అడపదడపా సినిమాలతో  పలకరిస్తూనే ఉన్నారు. మంచి నటుడు అనిపించుకున్న స్టార్ మాత్రం కాలేకపోయారు. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాకు ‘పార్ధు’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. హారిక, హాసిని క్రియేసన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది.. ఈ సినిమా ఏదైనా సీనియర్ హీరోయిన్ కూడా నటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.

    Mahesh Babu - Namrata : చాలా యేళ్ల తర్వాత భార్య నమ్రతతో మహేష్ బాబు ఫోటో షూట్.. వైరల్ అవుతున్న పిక్స్..


    ప్రస్తుతం మహేష్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. వచ్చే నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన షూటింగ్ దాదాపు కంప్లీటైంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి అనుకున్నట్టే ఈ చిత్రాన్ని అదే డేట్‌లో విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh babu, Sarkaru Vaari Paata, Tollywood, Trivikram

    తదుపరి వార్తలు