Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాకు యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక అది అలా ఉంటే మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్గా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లాక్ అయ్యిందని.. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ జూలై సెకండ్ వీక్ నుంచి మొదలుకానుందని తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేపనిలో ఉన్నారు.
అందులో భాగంగా ఇప్పటికే థమన్‌తో పాటల కంపోజింగ్ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఓ ఫైట్‌తో షూట్ స్టార్ట్ చేస్తారట టీమ్. ఈ ఫైట్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఓ రేంజ్లో కంపోజ్ చేయనున్నారట. ఇక మహేష్ - త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక పదకొండు సంవత్సరాల తరువాత (Mahesh Babu) మహేష్- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్నారు.
#SSMB28 #MaheshBabu #Trivikram pic.twitter.com/14VistoKBt
— Aakashavaani (@TheAakashavaani) June 16, 2022
ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది టీమ్. ఇక మరోవైపు (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.
ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది. అంతేకాదు ఈ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు టాక్. గతంలో త్రివిక్రమ్.. నదియా, కుష్పూ వంటి సీనియర్స్ హీరోయిన్స్‌ను మరోసారి టాలీవుడ్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కోవలో శోభనను కూడా ఈ సినిమాలో పాత్ర కోసం ఒప్పించినట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Pooja Hegde, Trivikram