Home /News /movies /

MAHESH BABU TRIVIKRAM MOVIE UPDATE SAI PALLAVI TO DO AN IMPORTANT ROLE HERE ARE THE DETAILS SR

Mahesh Babu | Sai Pallavi : మహేష్ బాబు సినిమాలో నటించడానికి సాయి పల్లవి ఒప్పుకుంటారా..

Mahesh and Sai Pallavi Photo : Twitter

Mahesh and Sai Pallavi Photo : Twitter

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. మహేష్ మోకాలు సర్జరీ కారణంగా షూటింగును వాయిదా వేసుకున్నారు.

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. మహేష్ మోకాలు సర్జరీ కారణంగా షూటింగును వాయిదా వేసుకున్నారు. దాదాపు 70 శాతం వరకు షూట్ కంప్లీట్ అయ్యిందని టాక్. ఇక అది అలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించింగా వాయిదా పడే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో విడుదలకానుందని తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఇలా ఉండగానే మహేష్ బాబు, త్రివిక్రమ్‌తో ఓ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలిపింది టీమ్. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో రూమర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సిస్టర్ పాత్ర కీలకంగా ఉండనుందట. దీంతో ఈ కీలక పాత్రలో హీరోయిన్ ‘సాయి పల్లవి’ని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే మరి మహేష్ సిస్టర్‌గా సాయి పల్లవి నటిస్తుందా అనేది చూడాలి. ఇక్కడ మరో విషయం ఏమంటే ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి, మహేష్ చెల్లిగా చేస్తారా.. అనేది చూడాలి..

  ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఖలేజా తర్వాత ఈ కాంబినేషన్‌లో ఈ సినిమా రావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు త్రివిక్రమ్ వరుసగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల తర్వాత వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్‌పై చిన్నబాబు నిర్మించనున్నారు.

  ఇక మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట విషయానికి వస్తే.. మోకాలు సర్జరీ చేయించుకున్న మహేష్, ఆర్వాత కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్నారు మహేష్. ఆయన ఆరోగ్య పరిస్థితి కోలుకున్నప్పటికీ మహేష్ ఇప్పట్లో షూటింగుకి రాకపోవచ్చని అంటున్నారు. దీనికి తోడు కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువుగా అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో షూటింగ్ రిస్టార్ట్ కాకపోవచ్చని టాక్ నడుస్తోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరించనున్నారు.  ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తి కానుందని అంటున్నారు.

  దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు.

  Naveen Polishetty : టాప్‌లో ట్రెండ్ అవుతోన్న నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు టైటిల్ టీజర్..

  ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Mahesh Babu, Sai Pallavi, Tollywood news, Trivikram Srinivas

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు