Mahesh Babu : మహేష్ ఇంటి కోసం ఐదు కోట్లు ఖర్చు చేస్తున్న త్రివిక్రమ్..

మహేష్ బాబు,త్రివిక్రమ్ (Twitter/Photo)

Mahesh Babu : సర్కారు వారి పాట సినిమా తర్వాత మరోసారి మహేష్ దర్శకుడు త్రివిక్రమ్‌తో చేయనున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మూడో సినిమా అనగానే ఇండస్ట్రీలో అపుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

 • Share this:
  మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ప్రస్తుతం టీమ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తోంది. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు మరో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సర్కారు వారి పాట సినిమా తర్వాత మరోసారి మహేష్ దర్శకుడు త్రివిక్రమ్‌తో చేయనున్నారు.

  మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మూడో సినిమా అనగానే ఇండస్ట్రీలో అపుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ‘అతడు’ సినిమాకు సీక్వెల్ అనే టాక్ వినబడుతోంది. ఈ సినిమాకు ‘పార్ధు’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

  Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో రానా దగ్గుబాటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా...

  అది అలా ఉంటే ఈ సినిమాపై మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ ఇంటి సెట్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయలతో భారీగా నిర్మిస్తున్నారని తెలుస్తోంది. చిత్ర నిర్మాణ డిజైనర్ ఎఎస్ ప్రకాష్ ఈ విలాసవంతమైన ఇంటిని రూపోందిస్తున్నారట. ఈ సెట్‌లో ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

  ఇక మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.

  ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.

  Bangarraju - Nagarjuna : నాగార్జున ‘బంగార్రాజు’లో బిగ్‌బాస్ బ్యూటీతో పాటు మరో క్రేజీ హీరోయిన్‌...

  సర్కారు వారి పాట ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది. దీంతో ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్  (Vidya Balan)నటించనుందని సమాచారం. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.

  ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.

  ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
  Published by:Suresh Rachamalla
  First published: