Mahesh Babu - Trivikram: మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో..

మహేష్ బాబు,త్రివిక్రమ్ (Twitter/Photo)

Mahesh Babu - Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మూడో సినిమా అనగానే ఇండస్ట్రీలో అపుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో అక్కినేని హీరో కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

  • Share this:
    Mahesh Babu - Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మూడో సినిమా అనగానే ఇండస్ట్రీలో అపుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూసారు అభిమానులు. చాలా యేళ్ల తర్వాత వీళ్ల కాంబినేషన్ పట్టాలెక్కబోతుంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో అతడు సక్సెస్ సాధిస్తే.. ‘ఖలేజా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా టీవీలో మాత్రం సక్సెస్ అయింది. మధ్యలో సినిమాలు చేయకపోయినా.. వీళ్లిద్దరు కొన్ని యాడ్స్ మాత్రం కలిసి చేసారు. ఖలేజా సినిమా సమయంలో వీళ్లిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయనే మాటలు వినిపించాయి. తాజాగా వీళ్లిద్దరు కాంప్రమైజ్ అయి మళ్లీ పని చేయడానికి రెడీ అయ్యారు.

    ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా ‘అతడు’ సినిమాకు సీక్వెల్ అనే టాక్ వినబడుతోంది. మరోవైపు ఈ సినిమాలో ఇంకో హీరోకు ఛాన్స్ ఉందట. ‘అల వైకుంఠపురుములో’ సుశాంత్ లాగా.. మహేష్, త్రివిక్రమ్ మూవీలో సుమంత్ మరో హీరోగా సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇక మహేష్ బాబు, సుమంత మంచి స్నేహితులు.

    Mahesh Babu - Trivikram Movie Sumanth Will Be Play Crucial Role Here Are The Details,Mahesh Babu - Trivikram: మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో..,mahesh babu,mahesh babu twitter,Mahesh Babu Trivikram Sumanth,Sumanth Mahesh babu Movie,mahesh babu instagram,mahesh babu trivikram movie athadu sequel,mahesh babu trivikram movie title parthu,mahesh babu trivikram movie,mahesh babu trivikram movie namrata shirodkar,telugu cinema,మహేష్ బాబు,త్రివిక్రమ్,మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా అతడు సీక్వెల్,మహేష్ త్రివిక్రమ్ టైటిల్ పార్థు,మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీలో సుమంత్,సుమంత్,
    మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో సుమంత్ కీలక పాత్ర (Twitter/Photo)


    వీళ్లిద్దరు కూడా ఒకేసారి కెరీర్‌ స్టార్ట్ చేసారు. కానీ మహేష్ బాబు సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదిగితే.. సుమంత్ మాత్రం స్టార్ హీరో రేంజ్‌కు ఎదగలేకపోయారు. కానీ హీరోగా అడపదడపా సినిమాలతో  పలకరిస్తూనే ఉన్నారు. మంచి నటుడు అనిపించుకున్న స్టార్ మాత్రం కాలేకపోయారు. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాకు ‘పార్ధు’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. హారిక, హాసిని క్రియేసన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అఫీషియల్ అప్‌డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ఏదైనా సీనియర్ హీరోయిన్ కూడా నటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: