Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఇస్మార్ట్ పోరి.. త్వరలో అధికారిక ప్రకటన..

మహేష్ బాబు, నభా నటేష్ (File/Photo)

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సరసన ఇస్మార్ట్ పోరి  ఖరారైందా.. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

  • Share this:
    Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సరసన ఇస్మార్ట్ పోరి  ఖరారైందా.. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నారు.  రీసెంట్‌గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్(Keerthy Suresh) నటిస్తోంది.  ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సముద్రఖని మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్ మూవీస్‌లో మొదటి స్థానంలో నిలిచింది. తెలుగు వరకు మాత్రం ఎక్కువ మంది ట్వీట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

    ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని సోషల్ మెసేజ్‌తో తెరెక్కిస్తున్నారు. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడనేది ఈ మూవీ కథాంశంగా ఉండనున్నందని సమాచారం.

    ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మరో కథానాయకగా ఇస్మార్ట్ పోరి నభా నటేష్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ  విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. మహేష్ బాబు సరసన నభా నటేష్ అంటే నక్క తోక తొక్కినట్టే అనే చెప్పాలి.  ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది.  ‘సర్కారు వారి పాట’ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది.

    Mahesh Babu Trivikram Movie Nabha Natesh Will Be Pair With Mahesh Babu,Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఇస్మార్ట్ పోరి.. త్వరలో అధికారిక ప్రకటన..,Mahesh Babu,Mahesh Babu Twitter,Mahesh Babu Instagram,Mahesh Babu Nabha Natesh,Nabha Natesh Twitter, Nabha Natesh,నభా నటేష్,నభా నటేష్ మహేష్ బాబు,మహేష్ బాబు నభా నటేష్,మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ నభా నటేష్
    మహేష్ బాబు, నభా నటేష్ (File/Photo)


    మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దాంతో పాటు అల్లు అరవింద్ ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మించే రామాయణంలో మహేష్ బాబు శ్రీ రాముడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ రావణాసురుడి పాత్రలో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నది లేనిది త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: