Mahesh Babu - Trivikram : Mahesh Babu - Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా రవితేజ భామను ఫిక్స్ చేసారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూసారు అభిమానులు. చాలా యేళ్ల తర్వాత వీళ్ల కాంబినేషన్ పట్టాలెక్కబోతుంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో అతడు సక్సెస్ సాధిస్తే.. ‘ఖలేజా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా టీవీలో మాత్రం సక్సెస్ అయింది. మధ్యలో వీళ్లిద్దరు కలిసి సినిమాలు చేయలేదు.
కానీ మహేష్ బాబు నటించిన పలు ప్రకటనలను త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు. ఖలేజా సినిమా సమయంలో వీళ్లిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయనే మాటలు వినిపించాయి. తాజాగా వీళ్లిద్దరు కాంప్రమైజ్ అయి మళ్లీ పని చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కబోతున్న చిత్రం దీపావళి కానుకగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించే అవకాశాలున్నట్టు సమాచారం.
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా ‘అతడు’ సినిమాకు సీక్వెల్ అనే టాక్ వినబడుతోంది. మరోవైపు ఈ సినిమాలో ఇంకో హీరోకు ఛాన్స్ ఉందట. ‘అల వైకుంఠపురుములో’ సుశాంత్ లాగా.. మహేష్, త్రివిక్రమ్ మూవీలో సుమంత్ మరో హీరోగా సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాకు ‘పార్ధు’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.
Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. హారిక, హాసిని క్రియేసన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమాలో సెకండ్ కథానాయికకు ఛాన్స్ ఉంది. ఈ పాత్ర కోసం రవితేజ ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈమె ప్రభాస్, ప్రశాంత్ నీల్.. ‘సలార్’లో రెండో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇపుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలబడే అవకాశం ఉంది.
ప్రస్తుతం మహేష్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. వచ్చే నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన షూటింగ్ దాదాపు కంప్లీటైంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి అనుకున్నట్టే ఈ చిత్రాన్ని అదే డేట్‌లో విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Mahesh Babu, Meenakshi Chaudhary, ParasuRam, Pooja Hegde, Sarkaru vari paata, Trivikram