Mahesh Babu | Sarkaru Vaari Paata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాతో పలకరించనున్నారు. ఈ సినిమా ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7న (శనివారం) యూసుఫ్గుడలో నిర్వహించనున్నారు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ (Trivikram Srinivas) త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే కదా. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మొదలు పెట్టాలనీ చిత్రబృందం భావించింది. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి ఫారెన్ ట్రిప్‌కు వెళ్లారు.
అందుకే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూలై రెండో వారం నుంచి మొదలు కానుందట. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఓ ఫైట్‌తో షూట్ స్టార్ట్ చేస్తారట టీమ్. ఈ ఫైట్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఓ రేంజ్లో కంపోజ్ చేయనున్నారట. మహేష్ - త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక పదకొండు సంవత్సరాల తరువాత (Mahesh Babu) మహేష్- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Chiranjeevi Top Disaster Movies : ఆచార్య సహా చిరంజీవి కెరీర్లో టాప్ డిజాస్టర్ మూవీస్ ఇవే..
ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇక మరోవైపు (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది.
KGF 2 : దంగల్ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటిన కేజీఎఫ్ 2.. బాహుబలి 2 తర్వాత స్థానంలో యశ్ మూవీ..
మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్.. నదియా, కుష్పూ వంటి సీనియర్స్ హీరోయిన్స్‌ను మరోసారి టాలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఈ కోవలో శోభనను కూడా ఈ సినిమాలో పాత్ర కోసం ఒప్పించినట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood, Trivikram