Home /News /movies /

MAHESH BABU TRIVIKRAM MOVIE BIG UPDATE ON SUPER STAR KRISHNA BIRTHDAY TA

Mahesh Babu - Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీపై అదిరిపోయే అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీపై బిగ్ అప్టేట్ (Twitter/Photo)

మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీపై బిగ్ అప్టేట్ (Twitter/Photo)

Mahesh Babu - Trivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా సక్సెస్‌తో మహేష్ బాబు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే ఊపులో త్రివిక్రమ్ మూవీ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్టేట్ ఇవ్వనున్నారు.

ఇంకా చదవండి ...
    Mahesh Babu - Trivikram Update:  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 85.87 కోట్లు షేర్  (రూ. 133.80 కోట్లు గ్రాస్)  రాబట్టింది. ఈ సినిమా సక్సెస్ సంబరాల్లో ఉన్న ఈయన త్వరలో త్రివిక్రమ్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌అప్టేట్‌ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ఇవ్వనున్నట్టు సమాచారం. అంతేకాదు అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

    అందుకే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూలై రెండో వారం నుంచి మొదలు కానుందట. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఓ ఫైట్‌తో షూట్ స్టార్ట్ చేస్తారట టీమ్. ఈ ఫైట్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఓ రేంజ్‌లో కంపోజ్ చేయనున్నారట. మహేష్ - త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్ గతంలో అతడు,  ఖలేజా  సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక పదకొండు సంవత్సరాల తరువాత (Mahesh Babu) మహేష్- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

    Radhe Shyam - Acharya : ఆచార్య, రాధే శ్యామ్ సహా తెలుగులో ఎక్కువ నష్టాలు తీసుకొచ్చిన భారీ చిత్రాలు ఇవే..


    ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇక మరోవైపు  (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇందులో సూపర్ స్టార్‌ మహేష్ బాబుకు అంకుల్ పాత్రలో  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది.

    Acharya : ఆచార్య సహా భారీ అంచనాలతో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..

    మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్.. నదియా, కుష్పూ వంటి సీనియర్స్ హీరోయిన్స్‌ను మరోసారి టాలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఈ కోవలో శోభనను కూడా ఈ సినిమాలో పాత్ర కోసం ఒప్పించినట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ  చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood, Trivikram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు