పూర్తిగా మారిపోయిన మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్..

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్బారు. అయితే సరిలేరు నీకెవ్వరు మూవీ కంటే ముందు  తరువాత మహేష్ ప్రవర్తనలో చాల తేడా కనిపిస్తోందని అభిమానులు అనుకుంటున్నారు.

news18-telugu
Updated: January 22, 2020, 3:04 PM IST
పూర్తిగా మారిపోయిన మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్..
మహేష్ బాబు (Mahesh Babu)
  • Share this:
మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్బారు. సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో సందడి చేస్తోంది ఈ సినిమా. అయితేమూవీ జయాపజయాలతో పెద్దగా పట్టించుకోకుండా మహేష్ బాబు తన జర్నీని కొనసాగిస్తుంటారని చాలామంది అంటుంటారు. అయితే సరిలేరు నీకెవ్వరు మూవీ కంటే ముందు  తరువాత మహేష్ ప్రవర్తనలో చాల తేడా కనిపిస్తోందని అభిమానులు అనుకుంటున్నారు. గతంలో మహేష్ బాబు మీడియాకు ప్రమోషన్‌ కార్యక్రమాలు కాస్త దూరంగా ఉండేవాడు. మహేష్ ఎప్పుడూ మీడియాను కలిసినా నవ్వుతూ మాట్లాడుతాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెపుతాడన్న పేరుంది. సరదాగా నవ్వుతూ తనదైన స్టైల్‌లో అవసరమైన పంచులు పేలుస్తూ నవ్విస్తుంటాడు సూపర్‌ స్టార్. మహేష్ మీడియాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడన్న పేరు మాత్రం ఇంతవరకు రాలేదు. కాని ఇటీవల తాను కూడా స్వయంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడంతో ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. మీడియాకు స్పెషల్ ఇంటర్య్వూలు ఇస్తూ కనిపిస్తున్నాడు.ఎప్పుడూ మీడియాతో ఆచితూచి మాట్లాడే మహేష్ ఈ సారి కాస్త దూకుడు మీదే ఆన్సర్స్ ఇస్తున్నాడు.

Sarileru Neekevvaru movie 4 days Worldwide collections Mahesh Babu still continue at box office,Sarileru Neekevvaru movie 4 days collections,sarileru neekevvaru,mahesh babu,mahesh babu sarileru neekevvaru collections,Sarileru Nekevvaru movie 3 days collections,mahesh babu sarileru neekevvaru entered into 100 crore club,Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,Sarileru Neekevvaru collections,Sarileru Neekevvaru 2 days Worldwide collections,Sarileru Neekevvaru Worldwide collections,mahesh babu Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,sarileru neekevvaru movie 2 days AP/TS collections,mahesh babu,telugu cinema,మహేష్ బాబు,అనిల్ రావిపూడి,సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్స్,100 కోట్ల్ క్లబ్బులో సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కలెక్షన్స్ (Twitter/Photos)


ఇటీవల జరిగిన 'సరిలేరు నికేవ్వరు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో మహేష్ మీడియాతో ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్ఛర్యం కలిగించింది. ఎప్పుడూ లేనిది మహేష్ మీడియా పై కాస్త పంచ్‌లు వేయడం చూసి అక్కడి వారు ఆశ్యర్యపోతున్నారు. ఎపుడు మీడియా అంటే ముడుచుపోయే సూపర్ స్టార్.. ఇపుడు పిలిచి మరి ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు వాళ్లు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా జవాబు చెప్పడంతో పాటు పంచ్‌లు వేయడం చూసి మీడియా జనాలు ఆశ్చర్య పోతున్నారు. మొత్తానికి మీడియా విషయంలో మహేష్ బాబులోని మార్పును చూసి అభిమానులు కూడా సరిలేరు నీకెవ్వరు అంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 22, 2020, 3:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading