Mahesh-Trivikram : పదేళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో మహేష్.. మరోసారి క్రేజీ కాంబినేషన్..

Mahesh-Trivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: October 7, 2020, 1:53 PM IST
Mahesh-Trivikram : పదేళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో మహేష్.. మరోసారి క్రేజీ కాంబినేషన్..
మహేష్, త్రివిక్రమ్ Photo : Twitter
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. గీత గోవిందం లాంటీ బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఈ సినిమా షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను అమెరికాలో ఫ్లాన్ చేసింది చిత్రబృందం. సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించనుంది. ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ,తమిళ భాషల్లో విడుదల ఆయ్యే అవకాశం ఉంది.

పోయిన సంక్రాంతికి సరిలేరు నీకవ్వరు సినిమా తో వచ్చిన మహేష్ ఈ చిత్రంతో తన జైత్ర యాత్రను కొనసాగించాలని బలంగా ఫిక్స్ అయ్యి ఉన్నాడు. ఇక కరోనా కారణంగా ఇన్ని రోజులు ఆగిన ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కానుంది. అందులో భాగంగా ఇప్పటికే మేకర్స్ యూఎస్ లో లొకేషన్స్ వేటలో ఉన్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో మొదలు కానుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చెయ్యాలని భావిస్తోందట చిత్రబృందం. షూటింగ్ స్టార్ట్ చేసిన రెండు మూడు నెలల్లోనే సగానికి పైగా సినిమాను చిత్రీకరించారలనీ చిత్రబృందం భావిస్తోందట. అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. విద్యా బాలన్.. ఎలాంటీ భావాలైనా పలికించగల అద్భుత నటి. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటూ సీరియస్ పాత్రల్లో నటిస్తూ.. అదరగొడుతోంది. తెలుగులో ఈ భామ బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో బసవతారకం పాత్రలో నటిస్తూ... ఎమోషనల్ సీన్లలో కట్టిపడేసింది. సర్కారు వారి పాటలో విద్యా బాలన్ మహేష్‌కు సోదరిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడు. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక చిత్రం షూటింగ్ విషయానికి వస్తే, తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడ 45 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మొదటి నుండి విలన్‌గా ఎవరు చేస్తున్నారు అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. స్టార్ హీరోలకు హీరోయిన్ ఎంపిక ఎంత కష్టమో.. విలన్ ఎంపిక కూడా ఇంచుమించు అంతే కష్టంగా మారింది. హీరోకి సరితూగే విలన్ పాత్రధారిని ఎంచుకోవడం పెద్ద కసరత్తుతో కూడిన వ్యవహారంగా మారింది. ఒక సినిమాలో చేసిన విలన్ మరో సినిమాలో చేయకూడదు అని భావిస్తుంటారు దర్శక నిర్మాతలు. అంటే, సినిమా సినిమాకీ విలన్ మారుతుండాలన్న మాట. అందుకే, విలన్ పాత్రధారి ఎంపికకు ఆలస్యం అవుతుంటుంది తెలుగు సినిమాల్లో. అందులో భాగంగా.. 'సర్కారు వారి పాట' చిత్రం విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్రను మొదట ఉపేంద్ర పోషిస్తున్నాడని టాక్ నడిచింది. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో అరవింద్ స్వామి పేరు వినిపిస్తోంది. మహేష్ కి సరితూగే పర్సనాలిటీ.. లుక్ ఉండటం వల్ల అరవింద్ అయితే సరిగ్గా సరిపోతాడన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.



ఇక అది అలా ఉంటే.. మహేష్ బాబు ఓ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో త్వరలో ఓ చిత్రం చేయబోతున్నట్టుగా ఈ రోజు ప్రకటించాడు. ఈ ఇద్దరి కలయికలో పదేళ్ల క్రితం 'ఖలేజా' అనే సినిమా వచ్చింది. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం సక్సెస్ కాలేదు. దాంతో వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు మరో సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో మరో సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఇటీవల వార్తలొస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఖలేజా వచ్చి పదేళ్లయింది. అందులో నాకు నేను ఆర్టిస్టుగా కొత్తగా కనిపించాను. ఆ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకం. నా మిత్రుడు, బ్రిలియంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి కృతజ్ఞతలు. మా తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాను.. అది త్వరలోనే.. అంటూ మహేష్ తన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. తమ కాంబోలో తొందరలోనే ఓ సినిమా ఉందని హింట్ ఇచ్చాడు మహేష్. దీనితో మరో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా ఉండనుందని తెగ సంతోష పడుతున్నారు ఆయన అభిమానులు.  ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేష్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు ఫ్యాన్స్.
Published by: Suresh Rachamalla
First published: October 7, 2020, 1:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading